ఈ రాశి వారికి మిత్రులతో విభేదాలు | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి మిత్రులతో విభేదాలు

Published Mon, Feb 8 2021 6:50 AM

Daily Horoscope In Telugu 8-2-2021 - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత రుతువు; పుష్య మాసం;బహుళ పక్షం ద్వాదశి: తె. 3-17 తదుపరి త్రయోదశి మూల: మ. 3-41 తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: మ. 2-10 నుంచి 3-41 వరకు తిరిగి రాత్రి 12-30 నుంచి 2-01 వరకు అమృత ఘడియలు: ఉ. 9-36 నుంచి 11-08 వరకు దుర్ముహూర్తం: మ.12-31 నుంచి 1-22 వరకు తిరిగి మ. 2-52 నుంచి 3-38 వరకు 

రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు 
సూర్యోదయం: ఉ.6-35
సూర్యాస్తమయం: సా.5-54 సర్వ ఏకాదశి

రాశి ఫలాలు:
మేషం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు.  దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. 

మిథునం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధనలబ్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

తుల: బంధువులతో సఖ్యత. శుభవార్తలు అందుతాయి. ఆస్తి, ధనలాభ సూచనలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.

వృశ్చికం: కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు: బంధువుల నుంచి ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు  లాభిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మకరం: సన్నిహితులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు కొంత గందరగోళం. పనుల్లో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. స్వల్ప ధనలాభం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. సోదరులతో సఖ్యత. వాహనయోగం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

Advertisement
Advertisement