Horoscope Today, May 5, 2023 In Telugu: నేటి రాశి ఫలాలు..ఈ రాశివారికి నూతన ఉద్యోగ ప్రాప్తి.. వస్తు లాభం.. - Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి నూతన ఉద్యోగ ప్రాప్తి.. వస్తు లాభం..

Published Wed, May 10 2023 7:21 AM

Horoscope Today 10-05-2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పంచమి ప.3.24 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పూర్వాషాఢ సా.5.34 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.1.22 నుండి 2.54 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.21 వరకు, అమృతఘడియలు: ప.1.22 నుండి 2.52 వరకు

సూర్యోదయం:    5.35
సూర్యాస్తమయం:  6.17
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం:  ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు

వృషభం: పనులలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో  నిరుత్సాహం. దైవదర్శనాలు.

కర్కాటకం: కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తు లాభాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: విద్యార్థుల యత్నాలు అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: ప్రయాణాలు వాయిదా. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: రుణాలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మకరం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.

కుంభం: పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

Advertisement
Advertisement