Today Rasi Phalalu: ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు.. | Horoscope Today, April 13, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు..

Published Thu, Apr 13 2023 6:51 AM

Horoscope Today 13 04 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.అష్టమి రా.12.24 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.9.51 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: సా.5.20 నుండి 6.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.44 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.11. 

మేషం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా మారవచ్చు.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తుంది.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి.

కర్కాటకం: నూతన ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థిక ప్రగతి ఉంటుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. 

సింహం: పనుల్లో ప్రతిష్ఠంభన. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనులలో జాప్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.

ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మకరం: ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. సోదరులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కుంభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యలు, వివాదాలు తీరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: వ్యవహారాలలో పురోగతి. ఆకస్మిక ధనలాభం. భూవివాదాలు పరిష్కారం. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement