Horoscope Today: 14 August 2023 In Telugu - Sakshi
Sakshi News home page

Rashi Phalalu - ఈ రాశి వారు శుభవార్త వింటారు, వస్తు లాభం

Published Mon, Aug 14 2023 6:47 AM

Horoscope Today 14-08-2023 Rasiphalalu Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ  మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.10.11 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పునర్వసు ప.12.02 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: రా.8.48 నుండి 10.34 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.21 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.53 వరకు,

అమృతఘడియలు: ఉ.9.27 నుండి 10.43 వరకు,
మాసశివరాత్రి; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
సూర్యోదయం: 5.45, సూర్యాస్తమయం: 6.24. 

మేషం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. 

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులు, కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం: బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. కుటుంబసమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల: చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. విందువినోదాలు. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

వృశ్చికం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు: కుటుంబసభ్యులతో వివాదాలు. రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మీనం: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

Advertisement
Advertisement