నేటి రాశి ఫలాలు..ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవం | Horoscope Today: April 20, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవం

Published Thu, Apr 20 2023 6:53 AM

Horoscope Today 20 04 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: అమావాస్య ఉ.9.44 వరకు, తదుపరి వైశాఖ శు.పాడ్యమి, నక్షత్రం: అశ్వని రా.11.33 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: రా.7.37 నుండి 9.14 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.44 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.44 వరకు, అమృతఘడియలు: సా.4.31 నుండి 6.03 వరకు.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.12
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం :  ఉ. 6.00 నుండి 7.30 వరకు 

మేషం: నూతన పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు చేస్తారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మిథునం: శుభవర్తమానాలు. రావలసిన సొమ్ము అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కర్కాటకం: సోదరుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తులు సమకూరతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.

సింహం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.
(చదవండి: శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం.. ఈ ఏడాదిశుభ ముహూర్తాలు ఇవే!)

కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలు రద్దు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

వృశ్చికం: సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

ధనుస్సు: శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మకరం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలలో నిరాశ.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.

మీనం: అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. కొన్ని పనులలో ఆటంకాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
(చదవండి: Ugadi 2023-Graha Swabhavalu: గ్రహ స్వభావాలు)

Advertisement
Advertisement