Horoscope Today in Telugu: 25 06 2023 - Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి శ్రమ ఫలిస్తుంది, ఆస్తిలాభం

Published Sun, Jun 25 2023 7:05 AM

Horoscope Today 25 06 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.సప్తమిరా.8.21 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పుబ్బ ఉ.7.24 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: ప.3.15 నుండి 4.57 వరకు, దుర్ముహూర్తం: సా.4.48 నుండి 5.40 వరకు, అమృతఘడియలు: రా.1.41 నుండి 2.34 వరకు.

సూర్యోదయం        :  5.31
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలిసిరావు.

మిథునం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. కొద్దిపాటి ఆస్తిలాభం. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం: రుణాల కోసం యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: సన్నిహితుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెంచుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

కన్య: శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు. దూరప్రయాణాలు. 

తుల: కొత్త పరిచయాలు. ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల విషయంలో కొత్త అంచనాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సోదరుల నుంచి ధనప్రాప్తి. కుటుంబసమస్యల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

ధనుస్సు: సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: నూతన పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మీనం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

Advertisement
Advertisement