Today's Horoscope: ఈ రాశివారికి శుభవార్తలు.. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం | Sakshi
Sakshi News home page

Today's Horoscope: ఈ రాశివారికి శుభవార్తలు.. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం

Published Wed, Aug 10 2022 6:40 AM

Today Horoscope 10-08-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.త్రయోదశి ప.12.19 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం పూర్వాషాఢ ఉ.8.34 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం సా.4.02 నుండి 5.32 వరకు దుర్ముహూర్తం ప.11.41 నుండి 12.31 వరకు అమృతఘడియలు... రా.1.01 నుండి 2.55 వరకు.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం    :  6.27
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు
 

మేషం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ తప్పదు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. విద్యార్థులకు నిరుత్సాహం. .

వృషభం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. 

మిథునం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. 

కర్కాటకం: కొన్ని బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. 

సింహం: ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణయత్నాలు. పనులు వాయిదా. విద్యార్థులకు శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

కన్య: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. 

తుల: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలకమైన నిర్ణయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం. 

వృశ్చికం: కుటుంబసభ్యులు, మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. 

ధనుస్సు: నూతన విద్య, ఉద్యోగ లాభాలు. పనులు చకచకా సాగుతాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. 

మకరం: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

కుంభం: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. 

మీనం: చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. 

Advertisement
Advertisement