Sakshi News home page

ఇవాళ్టి దినఫలం: ఈ రాశివారు అన్నింటా విజయం సాధిస్తారు.. మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

Published Mon, Dec 12 2022 7:24 AM

Today Horoscope 12 12 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, సోమవారం
సూర్యోదయం 6.24; సూర్యాస్తమయం 5.23. 

తిథి: బ.చవితి ప.3.41 వరకు, తదుపరి పంచమి, 
నక్షత్రం: పుష్యమి రా.9.21 వరకు, తదుపరి ఆశ్లేష, 

వర్జ్యం: లేదు, 
దుర్ముహూర్తం: ప.12.14 నుండి 12.58 వరకు, తదుపరి ప.2.26 నుండి 3.10 వరకు, 
అమృతఘడియలు: ప.2.15 నుండి 3.42 వరకు; 
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు, 
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు; 

మేషం: వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో ఉత్సాహంగా  గడుపుతారు. పరిస్థితులు మరింత మెరుగుపడతాయి.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కర్కాటకం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

సింహం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: రుణవిముక్తి లభిస్తుంది. మిత్రుల చేయూత అందుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: పరిచయాలు అధికమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. సోదరులతో కలహాలు. ఇంటాబయటా వ్యతిరేకత. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

ధనుస్సు: దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. స్థిరాస్తి వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు.

మకరం: పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవం. ఆస్తులు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

మీనం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement