ఈ రాశి వారికి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి | Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారికి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి

Published Mon, Jun 13 2022 6:22 AM

Today Horoscope 13-06-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.చతుర్దశి రా.8.03 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం అనూరాధ రా.8.55 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం రా.2.10 నుండి 3.42 వరకు, దుర్ముహూర్తం ప.12.24 నుండి 1.16 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.55 వరకు అమృతఘడియలు... ప.11.04 నుండి 12.34 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం...ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

వృషభం....సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. విందువినోదాలు.

మిథునం....ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం...దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవచింతన. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

సింహం...ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కన్య...వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

తుల....బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

వృశ్చికం....కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. పనులలో పురోగతి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

ధనుస్సు.....ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూవివాదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు చికాకు పరుస్తాయి.

మకరం..కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం...శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

మీనం...సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

Advertisement
Advertisement