Today Horoscope 19-07-2022 | Daily Rasi Phalalu July 19, 2022 In Telugu - Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారికి ధనలాభం, ఉద్యోగ-వ్యాపారాలకు అనుకూలం

Published Tue, Jul 19 2022 6:52 AM

Today Horoscope 19-07-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బ.షష్ఠి ప.1.07 వరకు, తదుపరి సప్తమి,నక్షత్రం ఉత్తరాభాద్ర సా.5.57 వరకు, తదుపరి రేవతి,  వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.8.12 నుండి 9.03 వరకు, తదుపరి రా.10.58 నుండి 11.42 వరకు, అమృతఘడియలు... ప.1.11 నుండి 2.46 వరకు. 

సూర్యోదయం :    5.38
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

మేషం: పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. 

వృషభం: పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ సేవలకు గుర్తింపు లబిస్తుంది. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

సింహం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మార్పులు.

తుల: రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు. వాహనాలు కొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.

వృశ్చికం: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆస్తి ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం: శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొంటారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

కుంభం: కుటుంబంలో సమస్యలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మీనం: పనులు సకాలంలో పూర్తి. సన్నిహితుల సాయం అందుతుంది. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి.

,

Advertisement

తప్పక చదవండి

Advertisement