Today Horoscope 22-07-2022: Daily Rasi Phalalu July 22 In Telugu - Sakshi
Sakshi News home page

Today's Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయం

Published Fri, Jul 22 2022 6:51 AM

Today Horoscope 22 07 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఆషాఢ మాసం, తిథి బ.నవమి ప.12.31 వరకు, తదుపరి దశమి. నక్షత్రం భరణి రా.7.54 వరకు, తదుపరి కృత్తిక. వర్జ్యం... లేదు. దుర్ముహూర్తం ఉ.8.12 నుండి 9.04 వరకు. తదుపరి ప.12.30 నుండి 1.22 వరకు. అమృతఘడియలు... ప.2.51 నుండి 4.33 వరకు. 

సూర్యోదయం :   ఉ 5.39
సూర్యాస్తమయం : సా.  6.33
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు


మేషం: ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం: మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. ప్రముఖుల సాయం తీసుకుంటారు. వాహనయోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిథునం: పనులు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. దైవదర్శనాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: రుణబాధలు తొలగుతాయి. పనులు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుండి విముక్తి.

తుల: పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

వృశ్చికం: రాబడి అంతగా కనిపించదు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆప్తుల నుండి ముఖ్య సమాచారం. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. భూలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

Advertisement
Advertisement