Horoscope Today, April 26, 2023 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం, మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే.. - Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 26 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం, మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

Published Wed, Apr 26 2023 6:31 AM

Today Horoscope 26 04 2023 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం,
సూర్యోదయం: 5.41, సూర్యాస్తమయం: 6.13.
తిథి: శు.షష్ఠి ఉ.11.10 వరకు, తదుపరి సప్తమి,
నక్షత్రం: పునర్వసు పూర్తి (24గంటలు),


వర్జ్యం: సా.5.29 నుండి 7.14 వరకు,
దుర్ముహూర్తం: ప.11.32 నుండి 12.23 వరకు,
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు,
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు,

అమృతఘడియలు: రా.3.58 ఉండి 5.43 వరకు;

మేషం: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: నూతన ఉద్యోగయోగం. చర్చలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

కర్కాటకం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగప్రాప్తి. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.

కన్య: మిత్రులతో సయోధ్య. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

వృశ్చికం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విచిత్రమైన సంఘటనలు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్తహోదాలు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో అకారణ వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మీనం: కొత్త రుణాలు చేస్తారు. పనులలో ఆటంకాలు. ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

Advertisement

తప్పక చదవండి

Advertisement