Horoscope Today, 28 April 2023 In Telugu: నేటి రాశి ఫలాలు..ఈ రాశివారికి ఉద్యోగావకాశాలు.. విద్యార్థులకు అనుకూలం - Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 28 రాశుల ఫలితాలు: ఈ రాశివారికి ఉద్యోగావకాశాలు.. విద్యార్థులకు అనుకూలం

Published Fri, Apr 28 2023 6:23 AM

Today Horoscope 28 04 2023 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ∙మాసం,
తిథి: శు.అష్టమి ప.2.57 వరకు, తదుపరి నవమి,
నక్షత్రం: పుష్యమి ఉ.9.11 వరకు, తదుపరి ఆశ్లేష,
సూర్యోదయం: 5.41, సూర్యాస్తమయం: 6.13. 

వర్జ్యం: రా.11.22 నుండి 1.08 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.11 నుండి 9.02 వరకు, తదుపరి రా.12.23 నుండి 1.13 వరకు,
హుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు,

అమృతఘడియలు: లేవు;

మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రతిభాపాటవాలకు గుర్తింపు రాగలదు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

సింహం: ముఖ్యమైన పనులలో స్వల్ప ఆటంకాలు. మిత్రులతో విభేదాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కన్య: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

తుల: పరిచయాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలం. కొత్త పనులు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు: వ్యవహారాలలో అవరోధాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. రావలసిన సొమ్ము అందుతుంది. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం: అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

Advertisement
Advertisement