ఈ రాశివారికి ధన, వస్తులాభాలు

29 Oct, 2022 06:53 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి:  శు.చవితి ఉ.10.25 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: జ్యేష్ఠ ప.12.02 వరకు, తదుపరి మూల, వర్జ్యం: రా.7.31 నుండి 9.01 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.02 నుండి 7.33 వరకు

అమృతఘడియలు: తె.4.29 నుండి 6.01 వరకు (తెల్లవారితే ఆదివారం), నాగుల చవితి; రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు, యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు; సూర్యోదయం 6.01; సూర్యాస్తమయం 5.27. 

మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృషభం: కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: ఉద్యోగార్ధుల యత్నాలలో పురోగతి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కర్కాటకం: ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. భూవివాదాలు నెలకొంటాయి. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ కొంత ఫలిస్తుంది. విద్యాయత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కన్య: బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.

తుల: కొన్ని వ్యవహారాలు చివరికి వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల నుండి ధనలబ్ధి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

ధనుస్సు: వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు తప్పకపోవచ్చు.

మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కుంభం: కార్యజయం. భూములు కొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

మీనం: పనుల్లో నిదానం అవసరం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆస్తుల విషయంలో ఇబ్బందులు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మరిన్ని వార్తలు