ఈ రాశి వారికి వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు

Published Tue, Feb 1 2022 6:12 AM

Today Horoscope Telugu-01-02-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువుపుష్య మాసం, తిథి అమావాస్య ఉ.11.48 వరకు, తదుపరి మాఘ శు.పాడ్యమి, నక్షత్రం శ్రవణం రా.8.58 వరకు, తదుపరి ధనిష్ఠ వర్జ్యం రా.12.48 నుండి 2.20 వరకు, దుర్ముహూర్తం ఉ.8.50 నుండి 9.35 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.48 వరకు అమృతఘడియలు... ఉ.11.04 నుండి 12.34 వరకు.

సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం :  5.51
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

రాశి ఫలాలుః 

మేషం... ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. స్థిరాస్తివృద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృషభం... మిత్రులతో కలహాలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం... కష్టానికి ఫలితం కనిపించదు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం.... సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం.శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య.. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల... ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృశ్చికం... కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు.... కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తిపై సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం.... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు.

కుంభం.. ఆర్థిక ఇబ్బందులు. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మీనం.... ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.

Advertisement
Advertisement