ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి | Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి

Published Fri, Apr 1 2022 6:02 AM

Today Horoscope In Telugu 01-04-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి అమావాస్య ఉ.11.50 వరకు, తదుపరి చైత్ర శు.పాడ్యమి, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.10.44 వరకు, తదుపరి రేవతి వర్జ్యం రా.11.03 నుండి 12.41 వరకు, దుర్ముహూర్తం ఉ.8.25 నుండి 9.14 వరకు, తదుపరి ప.12.28 నుండి 1.17 వరకు అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    6.00
సూర్యాస్తమయం     :  6.09
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థికంగా ఒడిదుడుకులు. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కన్య: చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: కొత్త విద్యావకాశాలు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

ధనుస్సు: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో కొంత జాప్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు.

మకరం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించని ప్రగతి.

కుంభం: మిత్రులే శత్రువుల్లా మారతారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మానసిక ఆందోళన. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. 

మీనం: కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

Advertisement
Advertisement