ఈ రాశి వారి అంచనాలు ఫలిస్తాయి

10 Apr, 2022 06:18 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి శు.నవమి రా.12.06 వరకు, తదుపరి దశమి, నక్షత్రం పుష్యమి తె.4.04 వరకు (తెల్లవారితే సోమవారం) తదుపరి ఆశ్లేష, వర్జ్యం ఉ.10.35 నుండి 12.20 వరకు, దుర్ముహూర్తం సా.4.30 నుండి 5.21 వరకు, అమృతఘడియలు... రా.9.03 నుండి 10.44 వరకు, శ్రీరామనవమి. 

సూర్యోదయం        :  5.51
సూర్యాస్తమయం    :  6.10
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

రాశి ఫలాలు..

మేషం: ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: సన్నిహితుల నుంచి పిలుపు. రావలసిన డబ్బు సమకూరుతుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో సమస్యలు తీరతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

సింహం: అనుకున్న పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

కన్య: రుణవిముక్తి లభిస్తుంది. పరపతి పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. కొన్ని అంచనాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. విద్యావకాశాలు. కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు పుంజుకుంటాయి.

వృశ్చికం: బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. కుటుంబసమస్యలతో సతమతమవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సామాన్యంగా ఉంటాయి.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

కుంభం: మిత్రుల చేయూత అందుతుంది. అనుకున్న వ్యవహారాలలో పురోగతి. భూ, వాహనయోగాలు. శ్రమ ఫలిస్తుంది. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: కొన్ని వివాదాలు నెలకొంటాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఆటుపోట్లు.

మరిన్ని వార్తలు