ఈ రాశి వారికి పనుల్లో విజయం, శుభవార్తలు వింటారు | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి పనుల్లో విజయం, శుభవార్తలు వింటారు

Published Sun, Dec 12 2021 6:05 AM

Today Horoscope Telugu-12-12-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.నవమి రా.12.01 వరకు, తదుపరి దశమి, నక్షత్రం ఉత్తరాభాద్ర తె.4.12 వరకు (తెల్లవారితే సోమవారం) తదుపరి రేవతి, వర్జ్యం ప.1.27 నుండి 3.05 వరకు, దుర్ముహూర్తం సా.3.54 నుండి 4.37 వరకు, అమృతఘడియలు... 11.15 నుండి 12.53 వరకు.

సూర్యోదయం :  6.24
సూర్యాస్తమయం :  5.23
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

రాశి ఫలాలు

మేషం.... పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. సోదరులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృషభం.... కీలక నిర్ణయాలు. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం..... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిష్ఠ పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొత్త ఆశలు.

కర్కాటకం.... పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. దూరప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు రద్దు. సోదరులను కలుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం... వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య.... కొత్త పరిచయాలు. సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆర్థిక వృద్ధి. చర్చల్లో పురోగతి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 

తుల... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. కొత్త పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. 

వృ శ్చికం... ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు.... సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

మకరం... పనుల్లో విజయం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

కుంభం.... కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

మీనం... శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

Advertisement
Advertisement