ఈ రాశివారికి ఆహ్వానాలు రాగలవు | Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఈ రాశివారికి ఆహ్వానాలు రాగలవు

Published Sat, Jan 15 2022 6:32 AM

Today Horoscope In Telugu 15-01-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.త్రయోదశి రా.12.30 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం మృగశిర రా.11.28 వరకు, తదుపరి ఆరుద్ర వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.6.37 నుండి 8.07 వరకు అమృతఘడియలు... రా.2.21 నుండి 3.56 వరకు, మకర సంక్రాంతి, శనిత్రయోదశి.

సూర్యోదయం :    6.39
సూర్యాస్తమయం    :  5.45
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు:
మేషం.. శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. బంధువుల కలయిక. ఇంటాబయటా చికాకులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృషభం.. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. నూతన పరిచయాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్పులు. కుటుంబసమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. 

కర్కాటకం.. చేపట్టిన పనుల్లో విజయం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం.. పరపతి పెరుగుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కన్య.. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనులలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

తుల.. వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం.. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు.. రుణాలు తీరతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మకరం.. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం.. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి

మీనం.. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement