ఈ రాశివారికి విచిత్ర సంఘటనలు.. | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి విచిత్ర సంఘటనలు..

Published Wed, Nov 24 2021 6:13 AM

Today Horoscope Telugu 24-11-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.పంచమి రా.10.34 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం పునర్వసు ప.1.27 వరకు, తదుపరి పుష్యమి వర్జ్యం రా.10.04 నుండి 11.45 వరకు దుర్ముహూర్తం ప.11.23 నుండి 12.07 వరకు అమృతఘడియలు... ఉ.10.50 నుండి 12.34 వరకు.

సూర్యోదయం :    6.13
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: వ్యవహారాలలో జాప్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

సింహం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: ఇంటర్వ్యూలు అందుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుంభం: పనులలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఉద్యోగయత్నాలు డీలాపడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.
 

Advertisement
Advertisement