Today Horoscope: ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి | Horoscope Today: 30 October 2023 In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి

Published Mon, Oct 30 2023 5:22 AM

today rasi phalalu daily horoscope 30 10 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.విదియ రా.11.30 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: భరణి ఉ.6.11 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: సా.6.05 నుండి 7.42 వరకు, దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.52 వరకు, తదుపరి ప.2.23 నుండి 3.10 వరకు, అమృతఘడియలు: రా.3.38 నుండి 5.13 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.01, సూర్యాస్తమయం: 5.27. 

మేషం..... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులలో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం... ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం... ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వస్తు, వస్త్రలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం.... సోదరులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య.... రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు. దైవదర్శనాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

తుల..... ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. అప్రయత్న కార్యసిద్ధి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు.

వృశ్చికం... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు.... ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులు, సోదరీలతో విభేదాలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మకరం.... ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. 

 కుంభం.... ఉద్యోగయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం.... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.
 
 

Advertisement
Advertisement