ఈ రాశి వారికి వారం చివరలో శుభవార్త, ధనలాభం | Weekly Horoscope: 22-10-2023 To 28-10-2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి వారం చివరలో శుభవార్త, ధనలాభం

Published Sun, Oct 22 2023 6:46 AM

Weekly Horoscope Telugu 22-10-23 To 28-10-23 - Sakshi

మేషం..
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం కొంత గందరగోళపరుస్తుంది. మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు వాయిదా వేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శ్రమ మరింత పెరుగుతుంది. మిత్రులు సైతం శత్రువులుగా మారవచ్చు. నిర్ణయాలలో ఆచితూచి ముందుకు సాగండి. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించకపోవచ్చు. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. నూతన పరిచయాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం..
విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మిథునం..
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు.  రాఘవేంద్రస్తుతి మంచిది.

కర్కాటకం..
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం..
ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మీ ఊహలు నిజం కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభవార్తలు వింటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాల కలసివస్తాయి. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రులతో చర్చలు సాగిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. వారం చివరిలో మానసిక ఆందోళన. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

కన్య..
అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది.  ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు.  గణేశాష్టకం పఠించండి.

తుల..
వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు.  పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.  చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు.  నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం..
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు.  శివాష్టకం పఠించండి.

ధనుస్సు..
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. బంధువులతో తగాదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు నిదానంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం  మధ్యలో ధనలబ్ధి. వాహనయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు.  లక్ష్మీస్తుతి మంచిది.

మకరం..
వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. పారిశ్రామికవర్గాల వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభం..
మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ఎరుపు, తెలుపు రంగులు.  ఆంజనేయ ప్రార్ధన మంచిది.

మీనం..
పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి విశేష ఆదరణ. వారం చివరిలో వివాదాలు. కుటుంబంలో సమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు.  శివస్తోత్రాలు పఠించండి.

Advertisement
Advertisement