ఈ వారంలో ఈ రాశివారు ఇళ్లు, వాహనాలు కొంటారు

24 Oct, 2021 06:24 IST|Sakshi

వారఫలాలు: 

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కాస్త  ఊరట చెందుతారు. పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం  కొంత మందగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురవుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప ఆరోగ్య సమస్యలు, మానసిక చికాకులు. తీరిక లేనంతగా పని ఒత్తిడి పెరుగుతుంది. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సేవాభావంతో అందర్నీ మెప్పిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్తిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశాలున్నాయి. కళాకారులు అవకాశాలు తిరిగి పొందుతారు. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో విభేదాలు నెలకొంటాయి. నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆత్మస్థైరం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన జరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనయోగం. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ఖర్చులు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నేరేడు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. మీ ప్రతిపాదనలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. గతంతో పోల్చుకుంటే ఆదాయం మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. 

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.  వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. లేత నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కార్యసాధన దిశగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ భావాలను బంధువులతో పంచుకుంటారు. వాళ్ళ ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, లేత గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు  నెమ్మదించినా చివరికి  పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాహయత్నాలు సఫలమవుతాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం కలుగు తుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వృథా ఖర్చులు. మిత్రులతో వివాదాలు ఏర్పడతాయి. అనారోగ్యం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.


మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తులు నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యులతో చర్చలు సఫలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. బంధువులతో తగాదాలు. లేత పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన  పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలకు పదవీయోగం. వారం ప్రారంభంలో శ్రమ తప్పదు. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పట్టుదలతో అధిగమించి ముందుకు సాగుతారు. పనులు ఆటంకాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు తమ సత్తా చాటుకుంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో మరింత అనుకూలం. రాజకీయవేత్తలకు కీలక విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. స్నేహితులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మరిన్ని వార్తలు