ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కలిసొస్తుంది | Weekly Horoscope: 28 January 2024 To 03 February 2024 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కలిసొస్తుంది

Published Sun, Jan 28 2024 7:12 AM

Weekly Horoscope Telugu 28 01 24 To 03 02 24 - Sakshi

మేషం: ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి.బంధువర్గంతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కొంత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది.  నలుపు, నీలం రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.  వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్య సూచనలు. గులాబీ, పసుపు రంగులు.శివపంచాక్షరి పఠించండి.

మిథునం: అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొంత తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది.  వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కర్కాటకం: అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది తప్పదు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది.  విద్యార్థులు, నిరుద్యోగులపై ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురవుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు.శివాష్టకం పఠించండి.

సింహం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి.కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు.  వారం చివరిలో మానసిక ఆందోళన. గులాబీ, తెలుపు రంగులు. భూవివాదాలు.  విష్ణుసహస్రనామ పారాయణ  చేయండి.

కన్య: ఎంతటి కార్యాన్నైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు నుంచి ఆహ్వానాలు రాగలవు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఆకర్షిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.  ఆకుపచ్చ, నీలం రంగులు.   దత్తాత్రేయ పూజలుచేయండి.

తుల: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులలో అవాంతరాలు తొలగుతాయి. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం కాగలవు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు సైతం సహాయపడతారు. ఆస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది.  వ్యాపారాలలో అనుకూలస్థితి, పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుతాయి. విద్యార్థులకు శుభవర్తమానాలు.  వారం చివరిలో శ్రమ తప్పదు. నిర్ణయాలు మార్చుకుంటారు. గులాబీ, లేత ఎరుపు రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: అదనపు రాబడి ఉంటుంది. అనుకున్న పనులు సాఫీగా పూర్తి కాగలవు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు తొలగుతాయి.  రాజకీయవర్గాలకు అనుకూలత. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్నేహితులతో మాటపట్టింపులు. పసుపు, లేతనీలం రంగులు.హనుమాన్‌ చాలీసా పఠించండి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఎరుపు, లేత గులాబీ రంగులు.అంగారక స్తోత్రం పఠించండి.

మకరం: వ్యయప్రయాసలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించే వరకూ విశ్రమించరు. ఆర్థిక వ్యవహారాలో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.  వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. నీలం, నేరేడు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.

కుంభం: ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు.దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం: వీరిని విజయాలు వరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. కళాకారులకు విశేష ఆదరణ.  వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు.  అంగారక స్తోత్రాలు పఠించండి.
 

Advertisement
Advertisement