పండుగలా వ్యవసాయం | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2023 1:18 AM

- - Sakshi

రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సాగుతోంది. గతంలో పెట్టుబడి సాయంలేక.. అప్పు ఇచ్చే దిక్కులేక అన్నదాతలు క్రాప్‌ హాలిడేలు ఇచ్చే దుస్థితి ఉండేది. నేడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి.. రైతులు నూతనోత్సాహంతో హలాలు పట్టి పొలాల వైపు సాగుతున్నారు. ప్రతి ఏటా రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని సత్వరమే ఇస్తుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: ఇది వరకు పంట పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేసేవారు. సకాలంలో అప్పు దొరక్కపోతే పంట సాగు చేయలేకపోయేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకుంటున్నారు. వ్యవసాయం పండుగలా సాగుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రలో రైతులు పడుతున్న కష్టాలను కళ్లారా చూశా రు. 2019లో ముఖ్యమంత్రి కాగానే మేనిఫెస్టోలో పొందుపర్చిన నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానంగా రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకోవాలనే సమున్నత ఆశయంతో ‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ అనే సంక్షేమ కార్యక్రమాన్ని గడువుకు ముందుగానే 2019 రబీలోనే అమలులోకి తెచ్చారు. ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఖరీఫ్‌ కోసం మే నెలలో రూ.7,500, రబీ కోసం అక్టోబర్‌లో రూ.4 వేలు, పంట కోతల సమయం అంటే సంక్రాంతి కానుకగా రూ.2 వేలు.. ఇలా మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తున్నారు. 2022 మే నెలలో మొదటి విడతగా రూ.7,500, రెండో విడత కింద గత అక్టోబర్‌లో రూ.4 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందజేశారు. ఇక తుది విడతగా సంక్రాంతికి రూ.2 వేలు చొప్పున అందించాల్సి ఉండగా.. ప్రతి రైతుకూ పీఎం కిసాన్‌ కోసం ఈ–కేవైసీ తప్పనిసరి చేయడంతో కాస్త ఆలస్యంగా మంగళవారం రూ.2 వేలు విడుదల చేయనున్నారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకొని గడువు లోపు చెల్లించిన రైతులకు ప్రభుత్వం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. తుది విడతగా గుంటూరు జిల్లాలోని 18 మండలాల్లోని 1,20,689 మంది రైతులకు రూ.25.93 కోట్ల వరకు మంగళవారం విడుదల చేస్తున్నారు. దీంతో వరుసగా నాలుగో ఏడాది కూడా విజయవంతంగా రైతుల ఖాతాల్లోకి పెట్టుబడిసాయం జమ చేసి భరోసా కల్పించనున్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా కౌలురైతులు, అటవీభూములు, దేవదాయభూముల సాగుదారులకు పూర్తి మొత్తం రూ.13,500 రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వీటితో పాటు జిల్లాలోని 6,070 మంది కౌలు రైతులకు రూ.13,500 చొప్పున రూ.2.23 కోట్లు వారి ఖాతాల్లో జమ కానుంది.

‘మాండూస్‌’ నష్టపరిహారం సైతం..

గత ఏడాది డిసెంబర్‌ మాసంలో మాండూస్‌ తుపాను వల్ల అధిక వర్షాలు కురిశాయి. జిల్లాలో పలు మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అధిక వర్షాలతో పంటలు దెబ్బతింటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ రెండు, మూడేళ్లకు విడుదలయ్యేది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతులకు సత్వరం ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా నెల నుంచి రెండు నెలల లోపే ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేస్తోంది. మాండూస్‌ తుపాను ప్రభావంతో వివిధ మండలాల్లో వరి, మినుము, మిరప, అరటి, కూరగాయల పంటలు 6,582.21 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. పెట్టుబడి రాయితీ కింద రూ.9.80 కోట్లు విడుదల కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తెనాలిలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో రైతు భరోసా–పీఎం కిసాన్‌ నగదు, మాండూస్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

¯ólyýl$ OÆð‡™èl$ ¿ýæÆøÝë&ï³-G… MìSÝ믌S Ð]lÊyø Ñyýl™èl A…§ýlgôæ™èl 1,20,689 Ð]l$…¨ OÆð‡™èl$-ÌS Rê™éÌZÏ fÐ]l$M>¯]l$¯]l² Æý‡*.25.93 Mør$Ï "Ð]l*…yýl*‹Ü' ™èl$´ë¯]l$ ¯]lçÙtç³ÇàÆý‡… OòÜ™èl… A…§ýlgôæ™èl 9,771 Ð]l$…¨ OÆð‡™èl$ÌSMýS$ A…§ýl¯]l$¯]l² Æý‡*.9.80 Mør$Ï ¯ólyýl$ ™ðl¯éÍÌZ ºr¯ŒS ¯öMìSP Ñyýl$-§ýlÌS ^ólĶæ$¯]l$¯]l² ïÜG… OÐðlG‹Ü fVýS¯ŒS

సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలను రైతులకు నేరుగా అందిస్తున్నా రు. వైఎస్సార్‌ రైతు భరోసా నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీనివల్ల సన్న, చిన్నకారు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా ఏ సీజన్‌కు సంబంధించిన ఇన్‌పుడ్‌ సబ్సిడీని ఆ సీజన్‌లో అందిస్తున్న ఏకై క నాయకుడు వైఎస్‌ జగన్‌.

– మెరిగల సుందరరావు, రైతు, కాకుమాను

1/1

Advertisement
Advertisement