యార్డుకు 32,071 బస్తాల మిర్చి | Sakshi
Sakshi News home page

యార్డుకు 32,071 బస్తాల మిర్చి

Published Thu, Aug 10 2023 7:42 AM

-

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు బుధవారం 32,071 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 31,171 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.23,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి 26,000 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం క్వింటాలుకు రూ.12,000 నుంచి రూ.24,000 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.13,000 నుంచి 25,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.14,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 10,699 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement