పన్నెండు మాసాల్లో కార్తిక మాసానికంటే మించినది మరొకటి లేదని | Sakshi
Sakshi News home page

పన్నెండు మాసాల్లో కార్తిక మాసానికంటే మించినది మరొకటి లేదని

Published Wed, Nov 15 2023 1:50 AM

- - Sakshi

‘న కార్తిక సమోమాసః’ అని మహర్షి అగస్త్యుడి మాట. పన్నెండు మాసాల్లో కార్తిక మాసానికంటే మించినది మరొకటి లేదని అర్థం. పుణ్యం సంపాదించుకోవడానికి, పాపం పోగొట్టుకోవడానికి భగవంతుడు ఇచ్చిన ఓ మంచి అవకాశం కార్తిక మాసం. అలాంటి మాసాన్ని భక్తజనం సద్వినియోగం చేసుకుంటారు. ప్రాతఃకాలంలోనే స్నానాదులు చేయడం, దేవాలయాలకు వెళ్లి దీపాలు వెలిగించి అభిషేక, అర్చనాదులు నిర్వహించడం, ఏక భుక్తం వంటివి మాసమంతా ఆచరిస్తారు. మంగళవారం నుంచి ఈ మాసం ఆరంభం కావడంతో గుంటూరులోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఆలయ ప్రాంగణాలలో మహిళలు ముగ్గులుపెట్టి వాటిపై దీపాలు వెలిగించి పూజలు చేశారు. పంచామృతాలతో లయకారుడిని అభిషేకించి భక్తజనం తరించింది.

– గుంటూరు

Advertisement
Advertisement