భూ వివాదంపై చీటింగ్‌ కేసు నమోదు | Sakshi
Sakshi News home page

భూ వివాదంపై చీటింగ్‌ కేసు నమోదు

Published Thu, Nov 16 2023 1:48 AM

-

మార్టూరు: భూమి విక్రయిస్తామని నమ్మించి భారీ మొత్తం నగదు అడ్వాన్స్‌గా తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేయక పోవడమే కాక దాడికి పాల్పడిన విషయమై స్థానిక పోలీస్‌ స్టేషన్‌ బుధవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు అందించిన వివరాలు.. మార్టూరుకు చెందిన పాపిశెట్టి వెంకట రమణ, ఆయన కుమార్తె స్పందన, కుమారుడు సుదర్శనరావులకు చెందిన 84 సెంట్ల భూమిని కొనుగోలు కోసం పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మండవ లక్ష్మీ ప్రసాద్‌ అగ్రిమెంట్‌ చేయించుకున్నాడు. ఈ సందర్భంగా 3, ఫిబ్రవరి 2014న రూ.37 లక్షలు అడ్వాన్స్‌ చెల్లించాడు. గడువుకు భూమిని తమకు రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందిగా 20, జూన్‌ 2023న లక్ష్మీ ప్రసాద్‌, భార్య కోటిరత్నం, స్నేహితుడు రాజేష్‌తో కలసి మార్టూరులోని వెంకట రమణ నివాసానికి వెళ్లి అడిగారు. రిజిస్ట్రేషన్‌ చేయడానికి నిరాకరించిన వెంకట రమణ, అతడి కుటుంబ సభ్యులు లక్ష్మీ ప్రసాద్‌, భార్య కోటి రత్నంపై అసభ్యంగా దూషిస్తూ విచక్షణా రహితంగా దాడి చేశారు. లక్ష్మీ ప్రసాద్‌ జరిగిన విషయమై అద్దంకి కోర్టులో కేసు ఫైల్‌ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులు పాపిశెట్టి వెంకట రమణ, కుమార్తె స్పందన, కుమారుడు సుదర్శనరావులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement