బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు పద్మావతి | Sakshi
Sakshi News home page

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు పద్మావతి

Published Fri, Nov 17 2023 1:44 AM

మాట్లాడుతున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు పద్మావతి  - Sakshi

విద్యార్థులకు చట్టాలపై అవగాహన తప్పనిసరి

అద్దంకి రూరల్‌: విద్యార్థులు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యు రాలు బత్తుల పద్మావతి అన్నారు. జాతీయ బాలల హక్కుల దినోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలో బాలలకు కల్పించిన హక్కులను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలన్నారు. బడిబయట గుర్తించిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించాలన్నారు. విద్యార్థులు తమ సమస్యలను ఫిర్యాదుల పెట్టెలో వేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ పీ దుర్గాగాయిత్రి, ఏసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఏ. అరుణ కుమారి, ఇందిరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

జగనన్నకు చెబుదాం కార్యక్రమం వాయిదా

భట్టిప్రోలు: భట్టిప్రోలులో శుక్రవారం జరగాల్సిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు ఎంపీడీవో గుమ్మా చంద్రశేఖరరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సూచనల మేరకు త్వరలో జరగబోయే తేదీని ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement