నేటి నుంచి వెనిగండ్లలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వెనిగండ్లలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు

Published Sat, Nov 18 2023 2:00 AM

- - Sakshi

పెదకాకాని: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు వెనిగండ్లలో నిర్వహించనున్నట్లు పీఈటీ, పోటీల నిర్వాహక కమిటీ కార్యదర్శి బేరం మస్తాన్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం నంబూరు తిరుపతిరావు శుక్రవారం తెలిపారు. స్థానిక వేమన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో అండర్‌– 14 బాల బాలికల జట్లు పాల్గొంటాయని చెప్పారు. క్రీడాకారులు 13 జిల్లాల నుంచి సుమారు 480 మంది, 50 మంది కోచ్‌ మేనేజర్లు, 50 మంది జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు హాజరవుతారని వివరించారు. మూడు రోజుల పాటు లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతుల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement