బాపట్ల | Sakshi
Sakshi News home page

బాపట్ల

Published Wed, Jan 10 2024 2:04 AM

- - Sakshi

బుధవారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2024

7

సీఏ ఫలితాల్లో

భానుప్రవీణ్‌తేజకు 31వ ర్యాంకు

ఫిరంగిపురం: గుంటూరు జిల్లా గుండాలపాడు గ్రామానికి చెందిన కొల్లి భాను ప్రవీణ్‌ తేజ మంగళవారం ప్రకటించిన ఆలిండియా సీఏ ఫైనల్‌ పరీక్షల్లో 31వ ర్యాంకు సాధించాడు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు కొల్లి వీరవసంతరావు, గీతాంజలి కుమారుడు.

ఆక్వా రైతులకు అండగా నిలుస్తుంది

ఆక్వా రైతులకు ఇన్స్యూరెన్స్‌ అవకాశం కల్పించాలని చాలా రోజులుగా అడుగుతున్నాం. ఎట్టకేలకు పైలట్‌ ప్రాజెక్టుగా స్కీం తెచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. ఈ స్కీం వల్ల ఆక్వా సాగు చేస్తున్న మన రాష్ట్ర రైతులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మత్స్యశాఖ ఆక్వా రైతులతో సమావేశాలు పెట్టి అవగాహన కల్పించాలి.

– దుగ్గినేని గోపీనాథ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్‌ రొయ్యరైతుల సంఘం

జిల్లాలో సాగులో ఉన్న రొయ్యల చెరువులు

సాక్షి ప్రతినిధి, బాపట్ల: అన్నివర్గాల రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆక్వా రైతులను కూడా ఆదుకునేందుకు సిద్ధమైంది. ఫిష్‌ ఆంధ్రా పేరుతో రైతులకు దేశీయ మార్కెట్‌ సృష్టించే సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ చేపలు, రొయ్యల వినియోగాన్ని పెంచేందుకు సిద్ధమైంది. ప్రకృతి వైఫరీత్యాలు, వ్యాధుల వల్ల నష్టపోతున్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇన్స్యూరెన్స్‌ సదుపాయం కల్పించింది. దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా బీమాను అమలు చేస్తుండటం గమనార్హం.

ఎన్‌ఎఫ్‌డీబీ సహకారంతో...

నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) హైదరాబాద్‌ , చైన్నె వారి సాంకేతిక సహకారంతో ఆక్వా చెరువులకు ఇన్స్యూరెన్స్‌ పథకాన్ని ‘పైలట్‌ ప్రాజెక్ట్‌’గా అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఓరియంటల్‌, అగ్రికల్చరల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీలను ఎంపిక చేశారు. జిల్లాలోని అర్హత కలిగిన ఆక్వా రైతులు పంట సాగుకు ముందు జిల్లా మత్స్యశాఖ అధికారులను సంప్రదించి బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఆక్వాకు వెన్నుదన్నుగా సర్కారు

ఆక్వా సాగుకు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వాస్తవానికి ఆక్వా రైతులు ఈహెచ్‌పీ, వైట్‌స్పాట్‌, వైట్‌గట్టు తదితర వ్యాధులతో సాగులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈహెచ్‌పీతో రొయ్యలో ఎదుగుదల ఆగిపోతుండగా వైట్‌గట్టుతో రొయ్య అన్నవాహిక దెబ్బతింటోంది. ఇక వైట్‌ స్పాట్‌తో జబ్బుచేసి రొయ్య చనిపోతుంది. వీటితోపాటు విబ్రియో వైరస్‌తో రైతులు నష్టపోతున్నారు. దీంతో రొయ్యల సాగుకు ఇన్స్యూరెన్స్‌ కల్పించాలని రైతులు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

ఏపీ నుంచే అధిక ఎగుమతులు

దేశంలో మన రాష్ట్రం నుంచే అత్యధికంగా ఆక్వా ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా 10.50 లక్షల టన్నులు అమెరికా, జపాన్‌,ౖ చెనా, యూరోప్‌, మిడిల్‌ ఏషియాలకు ఎగుమతి అవుతోంది. మిగిలిన 1.5 లక్షల టన్నులు స్థానికంగా అవసరాలకు వినియోగిస్తున్నారు.

ఫిష్‌ ఆంధ్రాతో స్థానిక మార్కెట్‌

ఎగుమతులతో నష్టాలు వస్తుండటంతో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఆక్వాకు మార్కెట్‌ కల్పించి రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ప్రధానంగా రొయ్యలు, చేపలను అధికంగా ఉపయోగించేలా ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పిస్తోంది. అందులో భాగంగా మండలస్థాయి నుంచి ఫిష్‌ ఆంధ్ర పేరుతో ఎక్కడికక్కడ రొయ్యలు, చేపల మార్కెట్లను నెలకొల్పుతోంది. కనీసం ఉత్పత్తిలో 50 శాతం స్థానికంగా ఖర్చయ్యేలా చర్యలు చేపట్టింది. ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

దేశంలో మొదటిసారిఆక్వాకు ఇన్స్యూరెన్స్‌ ఐదెకరాలలోపు రైతులకు వర్తింపు ప్రీమియంలో 20 నుంచి 30 శాతం రాయితీ రొయ్య రైతులకు అండగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

రైతులను ఆదుకునేందుకు ఇన్స్యూరెన్స్‌

ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దేశంలో తొలిసారి పైలట్‌ ప్రాజెక్టుగా ఇన్స్యూరెన్స్‌ను అమలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధుల వల్ల నష్టం జరిగితే ఇన్స్యూరెన్స్‌ అండగా ఉంటుంది. 20 శాతం రాయితీతో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తొలుత జిల్లాలో 50 మంది రైతులకు ఇన్స్యూరెన్స్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మార్చిలోపు రైతులు స్థానిక మత్స్యశాఖ కార్యాలయంలో సంప్రదించి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

– సురేష్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి, బాపట్ల జిల్లా

జిల్లాలో 50 మందికి ఇన్స్యూరెన్స్‌

ఇప్పటివరకు రొయ్యల రైతులకు ఎటువంటి ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం లేదు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతోపాటు వివిధ రకాల వ్యాధులతో ఆక్వా సాగుకు అనూహ్యంగా నష్టం జరుగుతోంది. కొన్నిసార్లు పంట పూర్తిగా దెబ్బతింటోంది. రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తాజాగా ఇన్స్యూరెన్స్‌ను అమలు చేస్తున్నారు. కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ వారి వద్ద రిజిస్టర్‌ అయి ఉన్న 2 నుంచి ఐదెకరాలలోపు రైతులు ఇందుకు అర్హులు. జిల్లాలో 7 వేల మందికి పైగా ఆక్వా రైతులు ఉండగా ఐదెకరాలలోపు రైతులు 4,800 మంది ఉన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నందున రాష్ట్రం మొత్తానికి తొలుత 200 హెక్టార్లకు మాత్రమే ఇన్స్యూరెన్స్‌కు అనుమతి ఉంది. ఈ లెక్కన బాపట్ల జిల్లా నుంచి 50 మంది రైతులకు తొలుత ఇన్స్యూరెన్స్‌ చేసుకొనే అవకాశం లభించింది. మార్చి నెలలోపు ఇన్స్యూరెన్స్‌ ప్రీమియం చెల్లించాల్సి వుంది. ఎకరాకు రూ.12 నుంచి 15 వేల వరకూ రైతులు ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం రైతులకు 20 శాతం సబ్సిడీ ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 30 శాతం రాయితీ కల్పిస్తుంది.

1/8

2/8

3/8

4/8

5/8

6/8

7/8

8/8

Advertisement
Advertisement