మహిళల విజయగాధలతో షీరోస్‌ పుస్తకావిష్కరణ | Sakshi
Sakshi News home page

మహిళల విజయగాధలతో షీరోస్‌ పుస్తకావిష్కరణ

Published Wed, Jan 10 2024 2:04 AM

-

గుంటూరు ఎడ్యుకేషన్‌ : భారతదేశంలో వివిధ రంగాల్లోని ప్రముఖ మహిళల విజయగాధలతో కూడిన షీరోస్‌ పుస్తకాన్ని శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ ఎన్‌. మంగాదేవి, వీవీఐటీ చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ ఆవిష్కరించారు. మంగళవారం గుంటూరు రూరల్‌ చేతన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఎన్నారై డాక్టర్‌ జాస్తి శివరామకృష్ణ ఆలోచనలతో మొదలైన షీరోస్‌ పుస్తకంలోని చిత్రాల రూపకల్పనను మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చేసిన బాబు దుండ్రపెల్లి పూర్తి చేశారు. ప్రపంచంలో ప్రసిద్ధులైన పురుషులను హీరోస్‌ అని పిలుచుకుంటుండగా, ప్రముఖ మహిళలు సాధించిన విజయాలతో కూడిన పుస్తకాన్ని తీసుకురావాలనే ఆలోచన నుంచి షీరోస్‌ రూపుదిద్దుకుంది. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 15 పాఠశాలలకు చెందిన 256 మంది బాలికలు షీరోస్‌గా సమాజంలో విభిన్న రంగాలకు చెందిన మహిళల వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.

Advertisement
Advertisement