Sakshi News home page

అంతర రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘా

Published Fri, Mar 29 2024 2:25 AM

- - Sakshi

నరసరావుపేట: అంతర్‌ రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల మీదుగా ఎన్నికల నిబంధనలు అతిక్రమించి చట్టవ్యతిరేకంగా అక్రమ నగదు, మద్యం, ఇతర వస్తువులు రవాణా జరగకుండా నిరంతర నిఘా ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల కలెక్టర్లు, ఎస్పీలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గురువారం నల్గొండ జిల్లా దామర్లచర్ల మండలం వాడపల్లి వద్దనున్న ఇండియన్‌ సిమెంట్స్‌ సమావేశ మందిరంలో సరిహద్దు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు అధికారులు సమావేశమయ్యారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డిలు మాట్లాడుతూ పల్నాడు జిల్లా సరిహద్దులోగల సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు రాకపోకలు సాగించే రహదారుల వెంబడి పోలీసు శాఖకు సంబంధించి తొమ్మిది చెక్‌పోస్టులు, ఎకై ్సజ్‌ శాఖకు చెందిన రెండు చెక్‌పోస్టులు, అటవీ, రవాణా శాఖలకు చెందిన ఒక్కొక్క చెక్‌పోస్టుల వద్ద ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా తగినంతమంది సిబ్బందిని నియమించటం జరుగుతుందన్నారు. సమావేశంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, ఎస్పీ బీజే రాహుల్‌ హెగ్డే, నల్గొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన, ఎస్పీ చందన దీప్తి, పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాదు, జిల్లా అటవీశాఖ అధికారి ఎన్‌.రామచంద్రరావు, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఖాజామొహిద్దీన్‌, గురజాల డీఎస్పీ పల్లపురాజు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల కలెక్టర్లు,

ఎస్పీలు నిర్ణయం

సమావేశానికి హాజరైన

పోలీసు అధికారులు

అక్రమ నగదు, మద్యం,

ఇతర వస్తువుల రవాణాకు చెక్‌

Advertisement

What’s your opinion

Advertisement