అద్దంకిలో టీడీపీ పని ఖతం | Sakshi
Sakshi News home page

అద్దంకిలో టీడీపీ పని ఖతం

Published Sun, Apr 7 2024 2:20 AM

వైఎస్సార్‌ సీపీలో చేరిన గుంటుపల్లి నాయకులు.. - Sakshi

బల్లికురవ: అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనకు ఆకర్షితులై శనివారం బల్లికురవ మండలంలోని రెండు గ్రామాలకు చెందిన ప్రధాన నాయకులు టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరందరికి హనిమిరెడ్డి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ కుల, మత, పార్టీలకు అతీతంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు వల్లే గ్రామాల వారీగా టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారని చెప్పారు. జగనన్న సంక్షేమ రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే అందరు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. మేనిఫెస్టోను నూరుశాతం అమలు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతోందని చెప్పారు. సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు మళ్లీ సీఎంగా వైఎస్‌ జగన్‌ను చేసుకుందామని పిలుపునిచ్చారు. అద్దంకిలో ఈసారి వైఎస్సార్‌ సీపీ గెలవడం ఖాయమని హనిమిరెడ్డి పేర్కొన్నారు. గుంటుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు మద్దినేని అశోక్‌ ఆధ్వర్యంలో మద్దినేని రామారావు, ఉప్పలపాటి రామకృష్ణ తమ అనుచరులతో పార్టీలో చేరారు. కొత్తమల్లాయపాలెం గ్రామానికి చెందిన జూపల్లి శ్రీను, ఉప్పమాగులూరు గ్రామానికి చెందిన దేవినేని కృష్ణబాబు ఆధ్వర్యంలో కొత్తమల్లాయపాలెం గ్రామానికి చెందిన అబ్బారెడ్డి, పార్థసారథి, జూపల్లి వీరాంజనేయులు, అప్పయ్య, కోండూరి హనుమంతరావు, నేరేడు పల్లి నరసింహారావు, లేమాటి వీరాంజనేయులు కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలోకి చేరాయి.

వైఎస్సార్‌ అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి చిన హనిమిరెడ్డి రెండు గ్రామాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి చేరిక పార్టీలోకి ఆహ్వానించిన అసెంబ్లీ అభ్యర్థి చిన హనిమిరెడ్డి

వైఎస్సార్‌ సీపీలో చేరిన వారితో చిన హనిమిరెడ్డి
1/1

వైఎస్సార్‌ సీపీలో చేరిన వారితో చిన హనిమిరెడ్డి

Advertisement
Advertisement