పోలీసులు లంచం అడిగారని ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

పోలీసులు లంచం అడిగారని ఆత్మహత్యాయత్నం

Published Sun, Apr 7 2024 2:20 AM

 చికిత్స పొందుతున్న బసివిరెడ్డి   - Sakshi

గుదిబండివారిపాలెం(కొల్లిపర): ఓ కేసు విషయంలో పోలీసులు లంచం అడిగినందుకు ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన కొల్లిపరలో నెలకొంది. బాధితుడు తెలిపిన వివరాలు... కొల్లిపర గ్రామ శివారు గుదిబండివారిపాలేనికి చెందిన ఈదా బసివిరెడ్డి గత నెల 25న ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు. ఏప్రిల్‌ 2వ తేదీన ట్రాక్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిచారు. ఈ విషయం తెలుసుకున్న బసివిరెడ్డి కొల్లిపర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 5వ తేదీన పోలీసులు కృష్ణా జిల్లా పామర్రులో ట్రాక్టర్‌తో పాటు దొంగిలించిన తొమ్మిది మంది పోలీసుస్టేషన్‌కు వచ్చారని, ట్రాక్టర్‌ను బసివిరెడ్డికి ఇవ్వటానికి పోలీసులు రెండు లక్షలు డిమాండ్‌ చేయగా, తాను అంత డబ్బులు ఇవ్వలేనని బసివిరెడ్డి మొరపెట్టుకోగా కానిస్టేబుల్‌ డి.శ్యామ్‌ దుర్బాషలాడారు. దీంతో ఆవేదనకు గురైన బసివిరెడ్డి ఇంటికి వెళ్లి పురుగుమందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు కొల్లిపర ప్రాథమిక వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం బసివిరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెనాలి వైద్యులు తెలిపారు. పోలీసులను వివరణ కోరగా ఈదా బసివిరెడ్డి, తమ బంధువులకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉండగా వారు బసివిరెడ్డికి చెప్పి ట్రాక్టర్‌ను తీసుకెళ్లారని, బసివిరెడ్డి ఫిర్యాదు చేయడంతో ట్రాక్టర్‌ను బంధువుల దగ్గర నుంచి అతడికి ఇప్పించామని పేర్కొన్నారు. ఎటువంటి లంచం అడగలేదని పోలీసులు తెలిపారు. రూ.10 లక్షలు గురించి మాకు ఎటువంటి సంబంధం లేదని గ్రామ పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని అతడి బంధువులకు సూచించామని తెలిపారు. గ్రామ పెద్దలు వారి బంధువులకు కనీసం రూ.2 లక్షలు ఇవ్వాలని బసిరెడ్డికి చెప్పడంతో అతను పురుగుమందు తాగినట్లు తెలిసిందని వివరించారు.

Advertisement
Advertisement