Top Stories
ప్రధాన వార్తలు
నేడే పోలింగ్.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభకు పోటీచేస్తున్న 2,841 మంది అభ్యర్థుల భవిష్యత్తు మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అసెంబ్లీకి పోటీచేస్తున్న 2,387 మంది, లోక్‌సభకు పోటీచేస్తున్న 454 మంది భవిష్యత్తును నిర్ణయించడానికి 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లలో ఉ.7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండడంతో అధికారులంతా ఆదివారం రాత్రికే ఎక్కడికక్కడ చేరుకున్నారు. కానీ, దానికి రెండు గంటల ముందు అంటే ఉ.5 గంటల నుంచే అధికారులు ఏర్పాట్లు మొదలుపెడతారని.. ఏజెంట్లు ఉ.5.30కల్లా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటే 90 నిమిషాల పాటు మాక్ పోలింగ్ నిర్వహించి ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదివారం తెలిపారు. సమస్యాత్మకంగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాల్లో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలకుగాను 31,385 చోట్ల అంటే 75 శాతం కేంద్రాలను లోపలా, బయట పూర్తిస్థాయిలో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని మీనా చెప్పారు. ఇందుకోసం సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 26 జిల్లాలకు సంబంధించి 26 టీవీ మానిటర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ సరళిని పోలింగ్ కేంద్రం లోపల, బయటా కూడా పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. ఇందుకు దాదాపు 150 మంది అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకొకసారి జరిగే ఓట్ల పండుగలో ప్రతిఒక్క ఓటరూ పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని ముఖేష్‌కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని.. అటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లంతా పాల్గొని ప్రజాస్యామ్యవ్యవస్థను పరిరక్షించుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 83శాతం ఓటింగ్ లక్ష్యంగా.. ఇక గత ఎన్నికల్లో రాష్ట్రంలో 79.84 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృతస్థాయిలో ఓటర్లను చైతన్యపర్చేలా పలు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించామన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి వయో వృద్ధులు, మహిళలు, యువత, పర్యావరణం పేరుతో మోడల్ పోలింగ్స్టేషన్లను ఏర్పాటుచేసి సుందరంగా అలంకరించారు. అదే విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస వసతులైన తాగునీరు, వీల్చైర్లు, ర్యాంపులు, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచామని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటుచేయడమే కాకుండా అవసరాన్ని బట్టి వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేయనున్నట్లు మీనా తెలిపారు. 1.60 లక్షల ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం.. రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. నిజానికి.. మొదట్లో ప్రతిపాదించినట్లుగా 46,165 పోలింగ్ కేంద్రాలకు 1.45 లక్షల ఈవీఎంలు సరిపోతాయని, అయితే.. అదనంగా ప్రతిపాదించిన 224 ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలకు మరో 15 వేల ఈవీఎంలు సమకూర్చుకున్నామన్నారు. మొత్తమ్మీద 46,389 పోలింగ్ కేంద్రాలలో 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నామని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట భద్రత డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పూర్తి భద్రతా ఏర్పాట్లుచేశామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర పోలీసు బలగాలకు అదనంగా సీఆర్పీఎఫ్, తమిళనాడు, కర్ణాటక పోలీసు బలగాలను మోహరించామన్నారు. వారితోపాటు మాజీ సైనికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన చెప్పారు. పోలింగ్ విధుల కోసం వినియోగిస్తున్న బలగాల వివరాలు..
వన్స్ మోర్.. 22 జాతీయ మీడియా సర్వేల్లోనూ ‘ఫ్యాన్’కే పట్టం
సాక్షి, అమరావతి: గత 59 నెలలుగా సుపరిపాలనతో ఇంటింటి ప్రగతి, సమ్మిళిత అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షాత్కారం చేశారు. సుపరిపాలన.. ఇంటింటి అభివృద్ధి.. సుస్థిరాభివృద్ధి మరింత ఉద్ధృతంగా కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగనే రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్సీపీకి మరోసారి అఖండ విజయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టడం.. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి సభలకు ప్రజాస్పందన లేకపోవడాన్ని బట్టి వైఎస్సార్సీపీ మరోసారి ఘన విజయం సాధించడం తథ్యమని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు. జాతీయ మీడియా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 22కుపైగా సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ తిరిగి అఖండ విజయం సాధిస్తుందని వెల్లడైంది. సీఎం జగన్ సుపరిపాలనపై సానుకూల పవనాలు ప్రచండంగా వీస్తుండడంతో అనుకూల (పాజిటివ్) ఓటుతో వైఎస్సార్సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంటింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలంటే..గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సీఎం జగన్ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు తమ జీవనోపాధులను మెరుగుపర్చుకున్నారు. బాబు హయాంలో 2018–19లో రాష్ట్రంలో పేదరికం 11.77 శాతం ఉంటే 2022–23 నాటికి సీఎం జగన్ పాలనలో 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. మళ్లీ జగన్ వస్తేనే ఇంటింటి భవిష్యత్తు మరింతగా మారుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సాగు మరింత లాభసాటిగా మారాలంటే..సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయ రంగాన్ని చక్కదిద్దారు. గ్రామాల్లో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకూ రైతన్నలను చేయిపట్టుకుని నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా అందిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, విపత్తుల వల్ల పంట నష్టపోతే ఆ సీజన్ ముగిసేలోగా రైతులకు పరిహారం అందిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. బాబు హయాంలో వ్యవసాయ రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు 2018–19లో 8.3 శాతంతో దేశంలో 12వ స్థానంలో ఉంటే 2023–24 నాటికి 13 శాతానికి వృద్ధి రేటు పెరిగింది. వ్యవసాయ వృద్ధి రేటులో ఏపీ ఆరో స్థానంలో నిలిచింది. మళ్లీ జగన్ వస్తేనే వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుందని రైతన్నలు, కౌలు రైతులు విశ్వసిస్తున్నారు. విద్యా ప్రమాణాలు మరింత ఉన్నతంగా మారాలంటే..ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేసిన సీఎం జగన్ పేదింటి బిడ్డలకు ఇంగ్లీషు మీడియం బోధన అందుబాటులోకి తెచ్చారు. సీబీఎస్ఈ సిలబస్ తీసుకొచ్చారు. అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద లాంటి పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సగటు నమోదు నిష్పత్తి రేటు వంద శాతానికి చేరుకుంది. మూడో తరగతి నుంచే విద్యార్థులకు టోఫెల్ శిక్షణ ఇస్తున్నారు. 2025–26 నుంచి ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) సిలబస్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి పరీక్షలు ఐబీ సిలబస్‌తో రాయనున్నారు. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీ భాగస్వామ్యంతో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను అందిస్తున్నారు. ఉన్నత ప్రమాణాలతో చదువులు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన మన విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు పోటీ పడే వాతావరణాన్ని కల్పిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తేనే విద్యా సంస్కరణలు కొనసాగి ఉన్నత విద్యా ప్రమాణాలతో తమ పిల్లల భవిత బాగుంటుందని తల్లితండ్రులు బలంగా భావిస్తున్నారు. వైద్యరంగంలో సంస్కరణలు కొనసాగాలంటే..వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి సీఎం జగన్ వైద్య సేవలను పేదల చెంతకు చేర్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సలు పేద, మధ్య తరగతికి అందుతున్నాయి. విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు పడ్డాయి. నాడు–నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కొనసాగి నాణ్యమైన వైద్యం ఉచితంగా పేదలకు, మధ్య తరగతికి అందాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్రం దూసుకెళ్లాలంటే..విభజిత ఆంధ్రప్రదేశ్‌ను 2014–19 మధ్య అవినీతి పాలనతో చంద్రబాబు అధోగతి పాలు చేశారు. సీఎం జగన్ అధికారం చేపట్టాక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రాన్ని సుస్థిరాభివృద్ధి వైపు నడిపించారు. రాష్ట్ర అప్పులు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 21.87 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో 12.13 శాతానికి తగ్గింది. దేశ జీడీపీలో మన వాటా చంద్రబాబు హయాంలో 4.47 శాతం ఉండగా సీఎం జగన్ హయాంలో 4.83 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్డీపీ చంద్రబాబు హయాంలో 2018–19లో 11 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో 2023–24 నాటికి 16.2 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో అత్యధిక జీఎస్డీపీ వాటా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది నాలుగో స్థానం కావడం గమనార్హం. బాబు హయాంలో ఏపీ 14వ స్థానంలో ఉండేది. ఇక తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,54,031 మాత్రమే ఉంటే 2023–24 నాటికి ఏకంగా రూ.2,19,518కి పెరిగింది. మళ్లీ జగన్ వస్తేనే రాష్ట్రం సుస్థిరాభివృద్ధి వైపు దూసుకెళుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.ఉద్యోగ, ఉపాధి విప్లవం మరింత గొప్పగా కొనసాగాలంటే..పారదర్శక పారిశ్రామిక విధానంతో సులభతర వాణిజ్యం(ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్)లో సీఎం జగన్ ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. విశాఖలో 2023 మార్చిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో రూ.13,08,887 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు చేసుకున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ 59 నెలల్లో రూ.3,02,085 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఎంఎస్ఎంఈలకు పోత్సాహకాలు ఇవ్వడంతో వాటి సంఖ్య 1.9 లక్షల నుంచి 7 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 58.22 లక్షల మంది ఉపాధి పొందారు. మళ్లీ జగన్ వస్తేనే భారీ పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని యువత బలంగా విశ్వసిస్తోంది.మహాస్వప్నం సాకారం కావాలంటే..విశాఖపట్నం సమీపంలో రూ.5 వేల కోట్లతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును సీఎం జగన్ నిర్మిస్తున్నారు. ఒకవైపు విదేశీ వర్సిటీల నుంచి ప్రతిష్టాత్మక కోర్సులు పూర్తి చేసిన రాష్ట్ర యువత.. బలమైన గ్రోత్ ఇంజిన్ లాంటి విశాఖ నగరం.. ఐకానిక్ బిల్డింగ్లు.. పెద్ద ఎత్తున వచ్చే ఐటీ, ఇతర పరిశ్రమలు.. కోస్తా తీరమంతటా విరాజిల్లేలా ‘బ్లూ’ ఎకానమీని ఆవిష్కరించడానికి సీఎం జగన్ నడుం బిగించారు. మళ్లీ జగన్ వస్తేనే ఆ మహాస్వప్నం సాకారమై రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని సామన్యుల నుంచి మేధావుల వరకూ బలంగా విశ్వసిస్తున్నారు. రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారాలంటే..సువిశాలమైన 974 కి.మీ.ల పొడవైన తీర ప్రాంతం రాష్ట్రం సొంతం. తీరం మన బలం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు దాన్ని ఎన్నడూ ఉపయోగించుకోవాలనే ఆలోచన చేయలేదు. సీఎం జగన్ రూ.16,500 కోట్లతో నాలుగు పోర్టులు(కాకినాడ గేట్‌వే, మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం) నిర్మిస్తున్నారు. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పుతున్నారు. ఇవన్నీ పూర్తయితే పోర్టు ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు దిగ్గజాలు క్యూ కట్టడం ఖాయం. రామాయపట్నం పోర్టు వద్ద ఇండోసోల్ పరిశ్రమ అప్పుడే ఉత్పత్తులను ప్రారంభించడమే అందుకు నిదర్శనం. మళ్లీ జగన్ వస్తేనే పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారుతాయని యువత బలంగా నమ్ముతోంది.
లోక్‌సభ పోరు నేడే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగించనున్నారు. ఈ మేరకు పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. బరిలో 525 మంది..: లోక్‌సభ ఎన్నికల్లో 1,65,28,366 మంది పురుష ఓటర్లు, 1,67,01,192 మంది మహిళా ఓటర్లు, 2,760 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,32,32,318 మంది ఓటేయనున్నారు. 17 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 525 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. ఇందులో 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈవీఎంలతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ముగిశాక ఎన్నికల సిబ్బంది సంబంధిత లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన రిసెప్షన్ సెంటర్‌కు తీసుకెళ్లి ఈవీఎంలను అప్పగిస్తారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. మరోవైపు ఏపీ అసెంబ్లీకి కూడా సోమవారమే ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి 25 ఎంపీ సీట్లకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. గందరగోళ పడకుండా ఓటేయండి..: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది బరిలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో 7 లోక్‌సభ స్థానాల పరిధిలో మూడు బ్యాలెట్ యూనిట్లతో, 9 లోక్‌సభ స్థానాల పరిధిలో రెండు బ్యాలెట్ యూనిట్లతో, ఒక లోక్‌సభ స్థానంలో ఒక బ్యాలెట్ యూనిట్‌తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా.. ఈవీఎంలో అభ్యర్థుల క్రమాన్ని పోలింగ్ బూత్‌ల బయట ప్రదర్శనకు పెట్టనున్నట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. ఇక దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ట్రైసైకిళ్లు, ర్యాంపులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్.. రాష్ట్రంలో మొత్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది. మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. ఆ డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి అప్పగిస్తారు. గడువు ముగిసే సరికి.. క్యూలో ఉంటే ఓటేయవచ్చు.. పోలింగ్ సమయం ముగిసే సరికి క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. అలా క్యూలో ఉన్నవారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. సమయం ముగిశాక పోలింగ్ కేంద్రానికి చేరుకునేవారికి ఓటేసేందుకు అవకాశం ఉండదు. ఎండ పెరగక ముందే ఉదయమే ఓటేస్తే మంచిదని.. వానలతో ఉష్ణోగ్రతలు కొంత తగ్గడం ఊరట కల్పించే అంశమని అధికారులు చెప్తున్నారు. ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్.. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని ఆదివారం రాత్రే తరలించామని అధికారులు వివరించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకే అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా పోలింగ్ ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారులు ప్రారంభించనున్నారు. 10 మంది ఓటర్లకే పోలింగ్ కేంద్రం ఈసారి అత్యల్ప సంఖ్యలో ఓటర్లున్న ప్రాంతాల్లో సైతం పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లోని ఈ ఓటర్లు దూర ప్రాంతాలకు వెళ్లి ఓటేయాల్సిన అవసరం లేకుండా చేసింది. అత్యల్పంగా 10 మంది, 12 మంది, 14 మంది ఓటర్లున్న మూడు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 25మందిలోపు ఓటర్లున్నవి 11, 50 మందిలోపు ఉన్నవి 22, 100 మంది లోపు ఉన్నవి 54 పోలింగ్ కేంద్రాలు ఉండటం గమనార్హం. హోరాహోరీగా పోరు! ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, గట్టిగా పోరాడినా అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎస్, కేంద్రంలో రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఇలా మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. 16 లోక్‌సభ స్థానాల్లో మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడనుండగా.. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇస్తున్నారు. గత నెల రోజులుగా మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో.. ఎక్కువ స్థానాల్లో గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.
కూటమి మాట.. రిజర్వేషన్లు రద్దు..
సాక్షి, అమరావతి: మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాలకు రిజర్వేషన్లు అవసరం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు! జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను బహిర్గతం చేసిన చంద్రబాబు వాటిని రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు! ‘ఎస్సీ, ఎస్టీలు, ఇతర కొన్ని వర్గాలకు ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మరి వాళ్లు ఏమైనా బాగుపడ్డారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్లు అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెబుతుండగా ఎన్డీఏతో పొత్తులో ఉన్న చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు మభ్యపెట్టేలా మాట్లాడారు. పోలింగ్‌కు ముందు చంద్రబాబు తన ముసుగు తొలగించి ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆ వర్గాలు ఆవేదనతో రగిలిపోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అధికారం ఇస్తే ఏపీలో ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు కావడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ పేదల పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వారి పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు. బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించిన చరిత్ర కూడా ఆయనదే. చంద్రబాబు నరనరానా కులోన్మాదం జీర్ణించుకుపోయిందనేందుకు దళితులు, ముస్లింలు, బీసీలకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తాజాగా ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ వారి పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో అది ఫేక్ అంటూ ఎప్పటి మాదిరిగానే గొంతు సవరించుకున్నారు.నైపుణ్య శిక్షణ చాలన్న పవన్‌చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కూడా రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను చాటుకున్నారు. దేశంలో చాలా కులాలు, ఉప కులాలు ఉన్నాయని, అందరూ రిజర్వేషన్లు అడుగుతారని, కానీ అందరికీ ఇవ్వలేమని ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పేర్కొన్నారు. అర్హతను బట్టి అవకాశాలు రావాలని, అందుకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే సరిపోతుందన్నారు. రిజర్వేషన్ల ద్వారా అందరికీ అవకాశాలు ఇవ్వలేమని, తన కులం వాళ్లు కూడా రిజర్వేషన్లు అడుగుతున్నారని, కానీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ వ్యాఖ్యల ద్వారా పేద వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు.
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరిట దేశ ప్రజలకు 10 హామీలు ఇచ్చారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే ఈ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. మోదీ కీ గ్యారంటీ కావాలో, కేజ్రీవాల్ కీ గ్యారంటీ కావాలో దేశ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. కేజ్రీవాల్ కీ గ్యారంటీ అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఇచి్చన హమీలన్నీ దేశాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవేనని తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఈ పది హామీల అమలును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. తాను ఇస్తున్న పది హామీలపై ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్యపక్షాలతో చర్చించలేదని అన్నారు. ఈ హామీలను నెరవేర్చేలా కూటమిలోని పారీ్టలను ఒప్పిస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు తాను గ్యారంటీలన్నీ అమలు చేశానని, మోదీ కీ గ్యారంటీ మాత్రం అమలు కాలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానంటూ మోదీ ఇచి్చన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. హామీలు ఇవే...1. పేదలకు ఉచిత విద్యుత్ దేశవ్యాప్తంగా నిత్యం 24 గంటలపాటు కరెంటు సరఫరా చేస్తాం. ఎక్కడా కరెంటు కోతలు ఉండవు. దేశంలోని పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. 2. నాణ్యమైన విద్య ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య ఉచితంగా విద్య అందిస్తాం. 3. ఉచితంగా చికిత్స ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్ నిర్మిస్తాం. ప్రతి జిల్లాలో అద్భుతమైన ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తాం. దేశంలోని ప్రతి వ్యక్తికీ మెరుగైన చికిత్స ఉచిత అందిస్తాం.4. చైనా ఆక్రమించిన భూమి స్వా«దీనం డ్రాగన్ దేశం చైనా ఆక్రమించిన మన దేశ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఈ విషయంలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. 5. అగి్నవీర్ యోజన నిలిపివేత అగి్నవీర్ పథకాన్ని నిలిపివేస్తాం. అన్నిరకాల సైనిక నియామకాలు పూర్వ విధానంలోనే జరుగుతాయి. ఇప్పటివరకు అగ్నివీర్ పథకంలో రిక్రూట్ అయిన అగి్నవీరులందరినీ పర్మినెంట్ చేస్తాం. 6. పంటలకు కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఖరారు చేస్తాం. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తాం. 7. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తాం. 8. యువతకు ఉద్యోగాలు నిరుద్యోగాన్ని క్రమపద్ధతిలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం. యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కలి్పస్తాం.9. అవినీతి నుంచి విముక్తి నిజాయితీపరులను జైలుకు పంపించి, అవినీతిపరులను రక్షించే బలమైన వ్యవస్థను బీజేపీ సృష్టించింది. ఈ వ్యవస్థను రద్దు చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బీజేపీ వాషింగ్ మెషీన్‌ను ప్రజల సక్షమంలోనే బద్ధలు కొడతాం. 10. స్వేచ్ఛా వాణిజ్యం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను సరళతరం చేస్తాం. వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. బీజేపీ కుట్ర విఫలం తాను అరెస్టయిన తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ కుట్ర విఫలమైందని చెప్పారు. తన అరెస్టు తర్వాత ఆప్ మరింత ఐక్యంగా మారిందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై వారితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ‘ఆప్’ను గెలిపిస్తే నేను జైలుకెళ్లను కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్లబోనని తెలిపారు. చీపురు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజల బాగు కోసం పనిచేసినందుకే తనను జైలుకు పంపించారని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం బీజేపీకి నచ్చలేదన్నారు. తాను మళ్లీ జైలుకు వెళితే ఢిల్లీలో అభివృద్ధి నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే భగవంతుడు తనను జైలు నుంచి బయటకు రప్పించాడని ప్రజలు చెబుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యనించారు.
తోడు దొంగలు
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు, చెరుకూరి రామోజీరావు.. అందరికీ చిరపరిచితమైన ఈ తోడు దొంగలు పైకి అత్యంత సత్యవంతులుగా, నీతీ నిజాయితీల గురించి ఒకరు మాటల్లో, మరొకరు రాతల్లో లెక్కలేనన్ని పాఠాలు చెబుతూ సమాజ నిర్దేశకులుగా కనిపిస్తారు. వారి చరిత్ర చూస్తే అంతా అవినీతి, అక్రమాలే. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, నయవంచనలే పరమపద సోపానాలుగా ఎదిగిన వారు.రాజకీయ నాయకుడిగా చంద్రబాబు, మీడియా అధిపతిగా రామోజీరావు 40 ఏళ్లుగా ఒకరికొకరు సహకరించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. రాజకీయంగా చంద్రబాబును ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి రామోజీరావు అన్ని రకాలుగా అండదండలు అందించారు. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు చంద్రబాబు బరితెగించి సహకరించారు. చంద్రబాబు కోసం రామోజీ తన మీడియాను విశృంఖలంగా ఉపయోగించారు. ఈ ఎన్నికల్లోనూ సిగ్గు విడిచి, బట్టలూడదీసుకుని మరీ అబద్ధాల యుద్ధం చేశారు.జీజే రెడ్డి అనే ప్రముఖుడి దగ్గర గుమస్తాగా చేరి ఆయన ఆస్తులన్నింటినీ కొట్టేసిన ఘరానా దొంగ రామోజీ. మార్గదర్శి చిట్‌ఫండ్స్, ఈనాడు కూడా జీజే రెడ్డి ఆలోచనలే. జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు నమోదవడంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. దీంతో ఆయన ఆస్తులన్నింటినీ రామోజీరావు సొంతం చేసుకున్నారు. మార్గదర్శిలో రామోజీ వాటా కేవలం రూ.10 మాత్రమే. మిగిలిన పెట్టుబడి అంతా జీజే రెడ్డిదే. దీనిపై ఇటీవల ఆయన కుమారుడు యూరీ రెడ్డి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.జీజే రెడ్డే కాదు.. సొంత బంధువులను కూడా మోసం చేసి విజయవాడ, విశాఖలో వారి ఆస్తులు కొల్లగొట్టారు రామోజీ. ఇలా దోపిడీ మార్గాల్లో సమకూర్చుకున్న ఆస్తులను రక్షించుకునేందుకు రాజకీయాలను ఉపయోగించుకున్నారు. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నారు. దీనికి ఎన్టీఆర్ అంగీకరించకపోవడంతో అధికారం కోసం గుంట నక్కలా వేచి చూస్తున్న చంద్రబాబును చేరదీశారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి చంద్రబాబుతో కలిసి కుట్ర పన్నారు.రామోజీ అండదండలతో చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రామోజీరావు వ్యాపారాలకు అన్ని రకాలుగా సహకరించారు. చంద్రబాబు అవినీతికి రామోజీ సహకరించారు. ఈనాడు విస్తరణ, మార్గదర్శి ద్వారా వేల కోట్లు దోచుకోవడానికి, ఫిలిం సిటీకి వేలాది ఎకరాల పేదల భూములు కొట్టేయడానికి సహకరించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రామోజీ సంస్థలు వేల కోట్లకు ఎదిగాయి.చంద్రబాబు ఏలేరు, ఐఎంజీ భారత్ కుంభకోణాలకు రామోజీ మద్దతుచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలు, అక్రమాలకు రామోజీ కప్పెట్టేశారు. బాబు ఎంత భయంకరమైన స్కాములు చేసినా ఈనాడులో ఒక్క అక్షరం రాయలేదు సరికదా, ఆయన్నో గొప్ప విజనరీగా చిత్రీకరించారు. ఐఎంజీ భారత్, ఏలేరు భూముల కుంభకోణాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారు.హైదరాబాద్‌లో స్టేడియంలు నిర్మించి, ఒలింపిక్ క్రీడాకారులను తయారు చేసే పేరుతో ఐఎంజీ భారత్‌కి 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉండగా చంద్రబాబు 800 ఎకరాలను అక్రమంగా కేటాయించాడు. దీన్ని కోర్టు తప్పు పట్టింది. ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని ఇటీవల తీర్పు కూడా ఇచ్చింది. ఇలాంటి ఎన్నో అక్రమాలను కప్పి పుచ్చి చంద్రబాబును గొప్ప నేతగా చూపించే ప్రయత్నం చేశారు రామోజీ. 2004లో ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు రాజకీయంగా సహకారం అందించారు.రామోజీ బంటుగానే చంద్రబాబుతన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడిన రామోజీకి చంద్రబాబు ఎప్పుడూ బంటుగానే ఉన్నారు. ఈనాడు గ్రూపు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని దివాలా తీసే పరిస్థితులకు వెళ్లినప్పుడు చంద్రబాబు సహకారం అందించారు. మార్గదర్శి అక్రమాలు బయటపడి రామోజీ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కోసం నిలబడి తెరవెనుక నుంచి మద్దతు పలికారు. దీనికి ప్రతిగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు రామోజీ శాయశక్తులా ప్రయత్నించారు.2014–19 సంవత్సరాల మధ్య ప్రపంచమే నివ్వెరపోయేలా జరిగిన అమరావతి భూముల కుంభకోణం సహా ఆయన చేసిన అరాచకాలని్నంటినీ రామోజీ కప్పిపుచ్చారు. ఈ ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును గెలిపించేందుకు సిగ్గు ఎగ్గు వదిలేసి ప్రజల మెదళ్లలో విషం ఎక్కించేందుకు సర్వశక్తులూ ఒడ్డారు.ఇలా ఆది నుంచి తోడు దొంగల్లా బాబు, రామోజీ ఒకరికొకరు ఆలంబనగా నిలబడి మోసాలు, కుట్రలతో ప్రజలను వంచిసూ్తనే ఎదిగారు. ఇప్పుడు కూడా వాటినే అస్త్రాలుగా ఉపయోగించుకుని ఈ దొంగలిద్దరూ మళ్లీ అధికారంలోకి వచ్చి దోపిడీని కొనసాగించాలని తహతహలాడుతున్నారు. కానీ నమ్మకం, నయవంచనలకు నిలువెత్తురూపాలైన ఈ ఇద్దరు రాక్షసుల ఆటలు సాగే పరిస్థితులు కనిపించట్లేదు.
పెత్తందారులకు మళ్లీ షాకే!
సాక్షి, అమరావతి : పెత్తందార్లకు మళ్లీ షాక్ ఇచ్చేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇంటింటా అభివృద్ధి కొనసాగాలని.. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తేనే సంక్షేమాభివృద్ధి పథకాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్నారు. సాధికారత కోసం ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియలో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పేదలంతా సిద్ధమయ్యారు.గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి, వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పారు. 59 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశారు. ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావులేకుండా.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు.సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు మొత్తం రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు.. జీవనోపాధులను మెరుగుపర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. సాధికారత కోసం పేదలంతా సిద్ధం విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 650కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. 2019 ఎన్నికల్లో వేరుపడిన ఆ పార్టీలు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ అలవికాని హామీలు ఇచ్చాయి.ఆ హామీల అమలు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేసింది. సీఎం జగన్ గత ఎన్నికల తరహాలోనే అమలు చేయదగిన హామీలతోనే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమికి ఇక్కడ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. చెప్పిన మాటపై నిలబడడని, మోసం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీంతో సాధికారత కోసం మళ్లీ జగనే రావాలని పేదలంతా బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తు మరింత గొప్పగా మార్చుకునేందుకు..⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. సీఎం జగన్ గ్రామాల్లో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ఏర్పాటు చేసి, విత్తు నుంచి విక్రయం దాకా రైతుల చేయిపట్టి నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు. పండించిన పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసేలోగా పరిహారాన్ని అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ⇒ గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సొంత ఊళ్లోనే సులభంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం.. జగనన్న సురక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భరోసా కల్పించారు. పునర్ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ⇒వైఎస్సార్ చేయూత, ఆసారాతో మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయంతో⇒‘పేదలంటే మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లోనే ఉండాలి.. పెత్తందారుల ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్లు తినగా మిగిలింది తింటూ బతకాలి.. పిల్లలను స్కూల్ లెవల్ వరకు తెలుగు మీడియంలో మాత్రమే చదివించాలి.. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే ఆలోచనే రాకూడదు.. టెన్త్ తర్వాత పెత్తందారుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ విభాగంలో, లోడింగ్.. అన్లోడింగ్ సెక్షన్లో, సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోమని బతిమిలాడాలి..అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు సృష్టించాం.. భయాందోళనలు పెంచేశాం.. డబ్బు సంచులతో ఎన్ఆర్ఐలను దింపాం.. పనోళ్లను పనోళ్లుగా ఉంచకుండా పేదరికాన్ని తగ్గించేస్తే మేమంతా ఏమైపోవాలి?’ అని చంద్రబాబు ఆయన పెత్తందారుల గ్యాంగ్ ఊగిపోతోంది. ⇒ ఈనాడు రామోజీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మందులు వాడినా హిస్టీరియా తగ్గడం లేదు. రాత్రిళ్లు ఉన్నట్లుండి లేచి కూర్చుంటున్నారట. అదిగో జగన్.. జగన్.. మళ్లీ వస్తున్నాడు అంటూ కలవరిస్తున్నారట! తప్పకుండా ఆయన కల నెరవేరుతుంది. పేదరికంపై, పేదలపై, దిగువ మధ్యతరగతి వర్గాలపై విషం నింపుకున్న ఈ పెత్తందారులు ఫలానా మంచి పని చేశామని ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేని దుస్థితిలో నిస్సిగ్గుగా మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. దు్రష్పచారాలు చేస్తున్నారు. వీరందరి వలువలూడదీసి తరమడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఊరూరా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ రెండు బటన్లు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని వేచి చూస్తున్నారు.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధాలేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధాలేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్ షేర్ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు 1,06,61,652 షేర్లు... లోకేశ్ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి. అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా... లోకేశ్‌ది రూ.12.40 కోట్లు. కానీ చంద్రబాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లుగా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లుగా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరిటేజ్ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కువగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.ఆ నోటీసులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్ చేయటం తప్ప ఆదాయానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వలేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్ ముసుగు వేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారికంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్ షేర్లకు అంత విలువ లేకపోయినా వాటి పేరిట చూపిస్తే సరిపోతుందని ఈ పన్నాగం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్రబాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొక్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్‌లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.బోనస్, స్ప్లిట్.. ఏమీ లేకుండానేనిజానికి 2019 తరువాత హెరిటేజ్ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి. అంటే ఐదేళ్లలో హెరిటేజ్ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే.... సెక్షన్ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా.
మీ ఓటు పడిందా? ఇలా కన్మర్ఫ్ చేస్కోండి
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
- రెండ్రోజులు వానలు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
- Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
- Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
- Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- పోలింగ్ సందర్భంగా హింసకు టీడీపీ కుట్ర
సినిమా
థ్రిల్లర్ మూవీలో హాట్ బ్యూటీ పాయల్.. ఫస్ట్ లుక్ చూశారా?
ఆర్ఎక్స్100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్.. సరికొత్తగా అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పోలీస్‌గా సందడి చేయనుంది. ఈ మేరకు పాయల్ నటిస్తున్న కొత్త మూవీకి 'రక్షణ' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ సినిమాలో పాయల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాల్ని వెల్లడించబోతున్నారు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్)
ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా
ఓ సినిమా థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీలోకి వస్తున్న రోజులివి. అలాంటిది ఈ మూవీ మాత్రం ఏకంగా ఏడాది తర్వాత ఇప్పుడు అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇప్పుడు అని కొన్నాళ్ల ముందు హడావుడి చేశారు. కానీ ఇన్నాళ్లకు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో రిలీజ్ కానుంది?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్)విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన సినిమా 'జర హట్కే జర బచ్కే'. రొమాంటిక్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ చిత్రం.. గతేడాది జూన్ లో థియేటర్లలో రిలీజైంది. ఇందులో 'తేరే వాస్తులే' అనే పాట అప్పట్లో తెగ పాపులర్ అయింది. రీల్స్ తెగ చేశారు. ఇక ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని జియో సినిమా దక్కించుకోగా... స్ట్రీమింగ్ మాత్రం ఇప్పుడు ఏడాది తర్వాత చేస్తోంది. మే 17 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. కపిల్ (విక్కీ కౌశల్), సౌమ్య (సారా) పెళ్లయిన కొత్త జంట. మిడిల్ క్లాస్ కుటుంబం కావడంతో వీళ్లకు బెడ్ రూమ్ ఇచ్చి, హాల్లో తల్లిదండ్రులు పడుకుంటూ ఉంటారు. అయితే భర్తతో సరదాగా గడుపుదామంటే అత్తమామ ఇంట్లోనే ఉన్నారని, కొత్తిల్లు తీసుకుందామని సౌమ్య అనుకుంటుంది. ఆవాస్ యోజన పథకం కోసం అప్లికేషన్ పెట్టడానికి వెళ్లి, అక్కడి అధికారితో కపిల్ గొడవపడతాడు. ఈ క్రమంలోనే విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: భయంకరమైన వ్యాధి.. అందరూ నన్ను దూరం పెట్టారు: హీరోయిన్)Sah-parivaar shaadi ki thi, ab sah-parivaar divorce bhi hoga! Toh aap sab #DivorceMeinZaroorAana 💔#ZaraHatkeZaraBachke streaming May 17 onwards, exclusively on JioCinema Premium. #ZHZBOnJioCinema #JioCinemaPremium@vickykaushal09 @SaraAliKhan pic.twitter.com/Vy4K5tLJDy— JioCinema (@JioCinema) May 12, 2024
Mother's Day 2024: బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘అమ్మ’
నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. తొమ్మిది నెలలు కడుపున మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. మన ఎదుగుదలలో అడుగడుగునా తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా..విలవిలలాడి పోయేది మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్ సినిమాలపై లుక్కేద్దాం.గుంటూరు కారం(2024)మహేశ్‌బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రం మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కినదే. ఇందులో మహేశ్‌కు తల్లిగా రమ్యకృష్ణ నటించింది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ- మహేశ్‌బాబు మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి.ఒకే ఒక జీవితం(2022)శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల నటించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కి మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తిక్. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు.'బిచ్చగాడు'తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(2012)2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మ చెప్పింది2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ప్రభాస్ 'ఛత్రపతి'(2005)రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి.యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు.అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(2003)2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.నిజంకొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. వీటితో పాటు అమ్మ, యమలీల, మాతృదేవోభవ, లోఫర్, చిరుత, అమ్మ రాజీనామా, సింహరాశి, పెదబాబు లాంటి సినిమాలు కూడా మదర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి.
తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్
తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (మే 12న) జరిగిన రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరణించింది. ఈ విషాద వార్తను ఆమె స్నేహితుడు, నటుడు చంద్రకాంత్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. పవిత్ర ఇక లేదన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. 'పాపా.. నీతో దిగిన చివరి ఫోటో ఇదేరా! నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావంటే నమ్మలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్.. నా కోసం తిరిగి వచ్చేయ్‌రా..' అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.కాగా పవిత్ర జయరామ్ త్రినయని అనే సీరియల్‌తో బాగా క్లిక్కయింది. ఇందులో తిలోత్తమగా విలనిజం పడించింది. అందకుముందు కన్నడ సీరియల్స్ చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క ధారావాహికతో సంపాదించింది. నటుడు చంద్రకాంత్ కూడా ఇదే సీరియల్లో నటిస్తున్నాడు. నటి మరణవార్త తెలిసిన తారలు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
ఫొటోలు
Actors And Their Polling Booths: టాలీవుడ్ హీరోలు ఓటేసేది ఇక్కడే (ఫోటోలు)
Vah Vyshnavi: సొంతింట్లో బుల్లితెర నటి సత్యనారాయణ వ్రతం (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
AP Assembly Elections 2024: ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పోలింగ్ సామాగ్రి తరలింపు కోసం అధికారులు బిజీ (ఫొటోలు)
Badrinath Temple Photos: జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ఆధ్యాత్మిక యాత్ర (ఫొటోలు)
క్రీడలు
రాజస్తాన్‌ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
ఐపీఎల్ - 2024 ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ మరో ముందడుగు వేసింది. రాజస్తాన్ రాయల్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది.చెపాక్ వేదికగా రాజస్తాన్‌తో ఆదివారం తలపడిన చెన్నై టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ సిమర్జీత్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్ (21) వికెట్లు పడగొట్టి శుభారంభం అందించాడు.వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్(15)ను కూడా వెనక్కి పంపి రాజస్తాన్ టాపార్డర్‌ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్(35 బంతుల్లో 47 నాటౌట్) పోరాడగా.. ధ్రువ్ జురెల్(18 బంతుల్లో 28) అతడికి సహకారం అందించాడు. మిగతా వాళ్లు చేతులెత్తేయగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్ రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 42 పరుగులు మాత్రమే చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో డారిల్ మిచెల్(22) ఫర్వాలేదనిపించగా.. మొయిన్ అలీ(10), శివం దూబే(18), రవీంద్ర జడేజా(5) విఫలమయ్యారు. ఏడో స్థానంలో వచ్చిన సమీర్ రజ్వీ ధనాధన్ ఇన్నింగ్స్(8 బంతుల్లో 15)తో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.సొంతమైదానంలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లింది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన సిమర్జీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.
CSK Vs RR: రాజస్తాన్, సీఎస్కే రసవత్తర పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. సీఎస్కే జట్టులోకి థీక్షణ రాగా.. రాజస్తాన్ జట్టులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు.ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని రాజస్తాన్ భావిస్తుంటే.. సీఎస్కే సైతం ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జీత్ సింగ్, మహేశ్ తీక్షణరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్
BAN Vs ZIM: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. దీంతో క్లీన్‌స్వీప్ నుంచి జింబాబ్వే తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(36) పరుగులతో రాణించాడు.జింబాబ్వే బౌలర్లలో ముజాబ్రానీ, బెన్నెట్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాంగ్వే, మసకజ్డా చెరో వికెట్ సాధించారు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బెన్నెట్(70 ), సికిందర్ రజా(72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఆల్హసన్, సైఫుద్దీన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
KKR Vs MI: కేకేఆర్ ఆల్‌రౌండర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ పీజులో 50 శాతం కోత
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్‌కు ఐపీఎల్ మెనెజ్‌మెంట్ బిగ్ షాకిచ్చింది. ఐపీఎల్-2024లో భాగంగా శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదిగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రమణ్‌దీప్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. తన తప్పును రమణ్ దీప్ అంగీకరించాడని, మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను సైతం అంగీకరించినట్టు ఐపీఎల్ పేర్కొంది. లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్. దీనికి ఆటగాడు కట్టుబడి ఉండాల్సిందే. క్రికెట్ పరికరాలు లేదంటే, స్టంప్స్‌ను బ్రేక్ చేయడం, గ్రౌండ్ పరికరాలు లేదంటే ఫిక్చర్లు, ప్రకటనల బోర్డులను డామేజ్లకు చేయడం వంటి ఆర్టికల్ 2.2 కిందకు వస్తాయి. ఇక ఈ మ్యాచ్‌లో రమణ్ దీప్ 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబైపై 18 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.
బిజినెస్
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
ప్రముఖ బిలినీయర్ 'గౌతమ్ సింఘానియా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల కూడా ఈయన మరో కారును కొనుగోలు చేశారు.గౌతమ్ సింఘానియా కొనుగోలు చేసిన కారు మెక్లారెన్ కంపెనీకి చెందిన 750ఎస్. దీని ధర మార్కెట్లో రూ.5.91 కోట్లు వరకు ఉంటుంది. అయితే సింఘానియా గ్యారేజిలో ఇప్పటికే రెండు మెక్లారెన్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. తాజాగా కొనుగోలు చేసిన మెక్లారెన్ 750ఎస్ కారు ఆరెంజ్ అండ్ బ్లాక్ డ్యుయల్-టోన్ షేడ్‌లో ఉండటం చూడవచ్చు.మెక్లారెన్ 750ఎస్ అనేది 720ఎస్ కంటే ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ కలిగి.. 750 పీఎస్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
న్యూ ఇయర్‌ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్ని పండుగలు, దినోత్సవాలు ఉన్నా మాతృ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇదిలా ఉంటే జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మదర్స్ డేకి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.జొమాటో డెలివరీ ఆర్డర్ వాల్యూమ్ పరంగా మదర్స్ డే కొత్త సంవత్సర వేడుకలను అధిగమించిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఈ మేరకు జొమాటో కార్యాలయంలోని సందడిగా ఉన్న కార్యకలాపాల దృశ్యాలను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి ఉద్యోగులు శ్రద్ధగా పని చేస్తున్న "సర్వీస్ రూమ్"గా దీనిని పేర్కొన్నారు."మొదటిసారిగా మదర్స్ డే, నూతన సంవత్సర వేడుకల కంటే (చాలా) ఎక్కువ వాల్యూమ్ రోజుగా మారుతోంది. ఈరోజు తమ తల్లులకు ట్రీట్ ఇచ్చేవారి కోసం పనిచేస్తున్నాం" అని పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఆఫీస్‌లోని సిబ్బందికి కూడా ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉందని ప్రకటరించారు. ఆహార పంపిణీ సేవలకు మదర్స్ డే ఒక ముఖ్యమైన సందర్భంగా ఉద్భవించడం వినియోగదారుల ప్రవర్తనలో వచ్చిన మార్పును సూచిస్తోంది.Mother's Day, for the first time ever, is turning out to be a (much) higher volume day than New Year's Eve. Full w̸a̸r̸ service room scenes at the office today. Fingers crossed, that we are able to serve everyone treating their moms today.A super cool surprise awaits… pic.twitter.com/3N37D00Udo— Deepinder Goyal (@deepigoyal) May 12, 2024
కేజీ కుంకుమపువ్వు రూ.4.95 లక్షలు - ఎందుకింత రేటు తెలుసా?
కుంకుమ పువ్వు గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే కేజీ కుంకుమపువ్వు ధర రూ.4.95 లక్షల వరకు అమ్ముడవుతున్నట్లు సమాచారం. గత నెలలో మనదేశంలో కుంకుమపువ్వు ధరలు హోల్‌సేల్ మార్కెట్లో 20 శాతం, రిటైల్‌లో 27 శాతం పెరిగాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ నుంచి కుంకుమపువ్వు సరఫరా బాగా తగ్గుతోంది. ఈ కారణంగా మనదేశంలో కుంకుమపువ్వు భారీగా పెరిగింది.భారతదేశంలో ఒక కేజీ కుంకుమ పువ్వు ధర.. సుమారు 70 గ్రాముల బంగారంతో సమానం. ఉత్తమ నాణ్యత గల భారతీయ కుంకుమపువ్వు ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్లో రూ. 3.5 లక్షల నుంచి రూ. 3.6 లక్షలకు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో నుంచి సరఫరా అవుతున్న సమయంలో కేజీ కుంకుమ పువ్వు ధర రూ. 2.8 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య ఉండేది. ప్రస్తుతం ఈ ధర భారీగా పెరిగింది.ప్రపంచంలోనే అతిపెద్ద కుంకుమపువ్వు ఉత్పత్తిదారు ఇరాన్. ఈ దేశంలో కుంకుమ పువ్వు వార్షిక ఉత్పత్తి సుమారు 430 టన్నులు. ఇది ప్రపంచ కుంకుమపువ్వు ఉత్పత్తిలో దాదాపు 90% వాటాను కలిగి ఉంది. అయితే భారతదేశంలో కుంకుమ పువ్వు ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.'రెడ్ గోల్డ్'గా ప్రాచుర్యం పొందిన కాశ్మీర్లో కుంకుమపువ్వు సాగు 5,707 హెక్టార్ల భూమిలో పండిస్తారు. ఇందులో కూడా సుమారు 90 శాతానికంటే ఎక్కువ దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని పాంపోర్ తహసీల్‌లో పండిస్తారు. మిగిలింది సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్, శ్రీనగర్ జిల్లాల్లో పండిస్తారు.కుంకుమ పువ్వు ఉత్పత్తి సంవత్సరానికి ఒకసారి మాత్రమే.. అక్టోబర్ చివరి నుంచి నవంబర్ మధ్య వరకు పండిస్తారు. ఒక కేజీ కుంకుమ పువ్వు పండించడానికి సుమారు 1,50,000 కంటే ఎక్కువ పువ్వులు కావాల్సి ఉంటుంది. వాతావరణంలో జరుగుతున్న కొన్ని మార్పుల వల్ల కుంకుమపువ్వు దిగుబడి బాగా తగ్గింది. దీంతో చాలామంది రైతులు కుంకుమ పువ్వు సాగును వదులుకుంటున్నారు.
ఆస్ట్రేలియాలో చదువు.. వీసాకు కొత్త రూల్
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. స్టూడెంట్ వీసా కావాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు దేశం కనీస వేతనంలో కనీసం 75 శాతానికి సమానమైన నిధులను కలిగి ఉండాలని ఆస్ట్రేలియా కొత్త నిబంధనను విధించింది.మే 10 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. ఆస్ట్రేలియాలో చదివేందుకు అర్హత సాధించడానికి, భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 29,710 ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ. 16,29,964) తమ బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ చూపించాలి.నాలుగు సార్లు పెంపుఇమిగ్రేషన్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం గడిచిన ఏడు నెలల్లో విద్యార్థుల పొదుపు సొమ్ముకు సంబంధించి వీసా నిబంధనలను నాలుగు సార్లు సవరించింది. గత సంవత్సరం అక్టోబర్ నాటికి, విద్యార్థి వీసాల కోసం చూపించాల్సిన మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ 21,041 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉండేది.ఈ ఏడాది మార్చిలో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని పెంచింది. కోవిడ్ పరిమితుల అనంతరం ఆస్ట్రేలియాకు విద్యార్థుల రాక పెరిగింది. దీంతో వసతికి సైతం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీసా చట్టాల అమలును కఠినతరం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వీడియోలు
పోలింగ్ కు కౌంట్ డౌన్
ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేసిన టీడీపీ నేత మోహన్ రెడ్డి
కాకినాడ జిల్లాలో పోలింగ్ కోసం స్వరం సిద్ధం
ఓటరు స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
కడపలో పోలింగ్ కి ఏర్పాట్లు
ఎన్నికల పండగ..కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
ఓటు ఎలా వేయాలి ?..ట్రైనింగ్ వీడియో మీకోసం
కెఎస్ఆర్ లైవ్ షో @ 12 May 2024
పూర్తయిన ఓటర్ స్లిప్పుల పంపిణీ
ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు
ఫ్యామిలీ
హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
బ్రిటన్ రాజు చార్లెస్ III చిన కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మర్క్లే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ జంట 2020లో రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుంటున్నట్లు ప్రకటించి ఈ జంట వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత అడపాదడపా కార్యక్రమాల్లో కెమెరా కంట చిక్కుతూ వార్తల్లో నిలవడం జరిగింది. ఈ సారి ఏకంగా రాజ కుటుంబానికి రాయల్టీ లుక్‌ని ఇచ్చే గౌనుని ధరించడం హాట్‌టాపిక్‌గా మారింది. రీజన్ ఏంటంటే..డచెస్ ఆఫ్ సస్సెక్స్‌గా పేరుగాంచిన మేఘన్ ఈ లేత గోధుమ రంగు గౌనుని డిజైనర్ హెడీ మెరిక్ చేత డిజైన్ చేయించుకుంది. డిజైనర్ ప్రకారం ఈ గౌను పేరు విండ్సర్ గౌన్ బ్లష్. విండర్స్ అనేది రాజ కుటుంబం చివరి పేరు. మేఘన్ మార్క్లే ప్రిన్స్ హ్యారీ శుక్రవారం నైజీరియా చేరుకున్నారు. దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆహ్వానం నేపథ్యంలో అక్కడ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఆ దేశంలోని తమ మొదటి పర్యటన నిమిత్తం ఇలా మేఘన్ మార్క్లే ఈ గౌనులో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రాజరికం హోదాను వదులుకున్నప్పుడూ మళ్లీ రాజరకిపు దుస్తులు ధరించడం ఏంటని సర్వత చర్చలు మొదలయ్యాయి. కాగా, ఈ జంట 2018లో హ్యారీ అమ్మమ్మ దివంగత క్వీన్ ఎలిజబెత్II వివాహ కానుకగా ఇచ్చిన బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని విండ్సర్ ఎస్టేట్‌లో నివశించేవారు. గతేడాది జూన్‌లోనే ఈ ఇంటిని ఖాళీ చేశారు. అయితే కింగ్ చార్లెస్ మేఘన్‌కి అత్యున్నత గౌరవం ఇద్దా అనుకుంటున్న కొద్ది క్షణాల ముందే ఈ దంపతులు రాజకుటుంబ విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.(చదవండి: 101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!)
101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!
గత గురువారం పద్మ అవార్డు వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ పద్మ అవార్డు గ్రహీతల్లో ఫ్రాన్స్ మహిళ భారతీయ వస్త్రాలంకరణలో తళుక్కుమన్నారు. అందరీ అటెన్షన్ ఆమె వైపే. చక్కగా సంప్రదాయ ఆకుపచ్చ పట్టు చీరలో భారతీయ మహిళ మాదిరిగా వచ్చి మరీ అవార్డు తీసుకున్నారు. ఆమెను భారతదేశపు నాల్గొవ అత్యున్నత పురస్కారం పద్మ శ్రీతో సత్కరించారు. ఆ ఫ్రాన్ మహిళ పేరు ఫార్లెట్ చోపిన్. ఇంతకీ ఎవరీ షార్లెట్ చోపిన్ అంటే..ఫ్రాన్స్‌కు చెందిన షార్లెట్ చోపిన్ యోగా ప్రాక్టీషనర్. ఫ్రాన్స్‌లోని చెర్లోని చిన్న పట్టణమైన లేరే నివాసి. ఆమె ఈ యోగాను 50 ఏళ్ల వయసులో నేర్చుకుని సాధించడం ప్రారంభించింది. వయోపరిమితిని లెక్కచేయకగా చాలా అలవోకగా నేర్చుకుని యోగా టీచర్‌గా మారి యోగా ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నందుకు గానూ ఆమెకు ఈ పురస్కరం లభించింది. అంతేగాదు గతేడాది జూలైలో షార్లెట్ చోపిన్ పారిస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో యోగాను ప్రోత్సహించేలా చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే ఆమె యోగా ఆనందాన్ని, సంపూర్ణ శ్రేయస్సును ఎలా ప్రోత్సహిస్తుంది అనేదానిపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది కూడా. కాగా గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చోపీన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. Defying age limiting norms by learning #yoga post turning 50, Charlotte Chopin, a 101-year-old Yoga exponent from France receives #PadmaShri from President Droupadi Murmu at the Rashtrapati Bhavan #PeoplesPadma #PadmaAwards2024 pic.twitter.com/B0QMx2FJ6B— PIB India (@PIB_India) May 9, 2024 (చదవండి: కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!)
కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!
మన భారతీయ ఫుడ్ స్టాల్ దాయాది దేశమైన పాక్‌లో ఉంటే ఎవ్వరికైనా గర్వంగా ఉంటుంది. మాటిమాటికీ ఏదో ఒక విషయమైన మనతో కాలుదువ్వే దేశంలో సగర్వంగా ఓ భారతీయురాలు ఫుడ్ స్టాల్ నడుపుతూ..అక్కడ పాకిస్తానీయులకు మన భారతీయ వంటకాలను రుచి చూపుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భారత్‌కు చెందిన కవితా దీదీ ఈ ఫుడ్ స్టాల్‌ని నడుపుతున్నట్లు కనిపించిది. ఈ స్టాల్ శాకాహారం, మాంసాహారం రెండింటిని అందిస్తుంది. ఓ పాకిస్తానీ బ్లాగార్ ఆమె ఫుడ్ స్టాల్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఆమె ఫుడ్ స్టాల్ గురించి వివరించాడు. ఆ వీడియోలో అతడు కవిత ఆమె కుటుంబం అందిస్తున్న రుచికరమైన ఆహారాన్ని హైలెట్ చేశారు. ముంబైలో వడపావ్ ఫేమస్. ఇప్పుడూ కరాచీ వాసులు కూడా ఈ భారతీయ వంటకాన్ని ఇష్టపడుతున్నారని కవిత చెబుతున్నారు. ఇక ఈ పాకిస్తాన్ బ్లాగర్ కూడా ఆ వంటకాన్ని రుచి చూసి మెచ్చుకున్నారు. ఇక్కడ కరాచీ ఆహార ప్రియులు తనను కవితా దీదీ అని అప్యాయంగా పిలుస్తారని కవితా ఆ వీడియో పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో తమ స్టాల్‌ని నడపమని చెప్పడంతో ఖాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇతర దేశాల్లోని మతాల పట్ల కనబర్చిన గౌరవం అంకితభావానికి బ్లాగర్ ఖాన్ చాలా ఫిదా అయ్యారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం మా సోదరికి పాకిస్తానీయులందరూ మద్దతు ఇవ్వాలి అని రాశారు. మరొకరు పాక్‌లో భారతీయ వంటకానికి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karamat Khan (@karamatkhan_05) (చదవండి: వందేళ్లకు పైగా జీవించిన వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్‌తో యూస్ ఉండదట!)
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
అది 1968, ఇంగ్లండ్‌లోని గ్లోస్టర్షర్లోని వాటన్–అండర్–ఎడ్జ్‌లో ఉన్న ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాన్ని ‘జాన్ హంఫ్రీస్’ అనే వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. అప్పటి దాకా ఆ భవనం 11వ శతాబ్దానికి చెందినదని, అందులో కొన్నేళ్ల పాటు బార్ అండ్ హోటల్ ఉండేదని మాత్రమే అతడికి తెలుసు. వ్యాపార దృక్పథంతోనే కొన్న జాన్.. ఆ భవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి.. బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్‌గా మార్చాడు. దానిలోనే ఒక పక్క కుటుంబంతో కలసి కాపురం పెట్టాడు. రోజులు గడిచే కొద్ది ఆ ఇంట్లో జరిగే అంతుచిక్కని పరిణామాలు వారిని వణికించడం మొదలుపెట్టాయి.ఒక రాత్రి జాన్ నిద్రపోయిన సమయంలో ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు, ఇల్లంతా తిప్పి విసిరికొట్టినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఒంటిపై గాయాలున్నాయి. తాను మాత్రం మంచం మీదే ఉన్నాడు. రోజు రోజుకీ ఇలాంటి హింసాత్మక అనుభవాలు మరింత ఎక్కువయ్యాయి. కేవలం జాన్‌కు మాత్రమే కాదు.. అతడి కూతురు ఎనిమిదేళ్ల కరోలిన్ హంఫ్రీస్తో పాటు జాన్ భార్య, మిగిలిన వారసులు, ఆ హోటల్లో డబ్బు చెల్లించి బస చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇలాంటి వింత అనుభవాలు హడలెత్తిస్తూ వచ్చాయి.దాంతో జాన్.. అప్పటికే సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ ‘ఏన్షియంట్ రేమ్ ఇన్ హౌస్’ గురించి అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో అతడ్ని భార్య, బంధువులు, కొడుకులు ఇలా అంతా వదిలిపోయినా.. కూతురు కరోలిన్ మాత్రం వదిలిపెట్టలేదు. గగుర్పాటు కలిగించే ఎన్నో అంశాలను వెలికి తీసే తండ్రి ప్రయత్నానికి.. చేయూతను ఇచ్చింది కరోలిన్. దాంతో జాన్.. అనుమానం కలిగిన ప్రతి గదిలోనూ తవ్వకాలు జరిపాడు. ప్రతి మూలలోనూ, గోడలోనూ.. ఆ అతీంద్రియ కదలికలను జల్లెడ పట్టాడు.అతడికి ఆ ఇంట్లో చాలా భయపెట్టే బొమ్మలు, ఎముకలు, పుర్రెలు, సమాధులు, పక్షులు, జంతువుల కళేబరాలు దొరికాయి. చాలా ఎముకలను పరిశీలిస్తే.. అవన్నీ చిన్న పిల్లల ఎముకలని తేలింది. పైగా వాటి చుట్టూ నరబలి ఆనవాళ్లు భయపెట్టాయి. చిత్ర విచిత్రమైన మొనదేరిన కత్తులు దొరికాయి. అవన్నీ 1145 నాటివని పురావస్తు నివేదికలు తేల్చాయి. దాంతో జాన్.. మీడియా సాయం కోరాడు. నాటి నుంచి ఈ హౌస్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.ఇతడి ఆసక్తికరమైన అన్వేషణలలో ఒక గోడ లోపల.. అప్పటికి 500 సంవత్సరాల నాటి పిల్లి కళేబరం బయటపడింది. ఆ గోడ గల గది ఓ మంత్రగత్తెదని, ఆ పిల్లి ఆ మంత్రగత్తె వెనుక తిరిగే నల్లపిల్లి అని ప్రచారంలో ఉన్న కథను తెలుసుకున్నాడు జాన్. ‘మంత్రగత్తె తనను వ్యతిరేకించే జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ హోటల్లో దాక్కుందని, తర్వాత అక్కడే ఆమె మరణించిందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని.. అక్కడ ఉండటానికి వచ్చినవారిని.. కనిపించని శక్తులు పరుగులు పెట్టించడమే ఇక్కడ మిస్టరీ.ఈ ఇంటికి సమీపంలో ఓ పెద్ద చర్చ్ కూడా ఉంది. అయితే ఆ చర్చికి, ఈ ఇంటికి రహస్య సొరంగ మార్గం ఉండటంతో.. ఆ చరిత్రను కూడా తవ్వే ప్రయత్నం చేశాడు జాన్. అయితే ఆ చర్చిలో పని చేసే బానిసలు, కాథలిక్ సన్యాసులు ఆ సొరంగ మార్గం ద్వారానే రాకపోకలు జరిపేవారని తేలింది. ఆ ఇంట్లోని మానవ అవశేషాలకు.. చర్చ్ అధికారులకు సంబంధం ఉందా అనేది మాత్రం తేలలేదు. అయితే ఈ ఇంటి నిర్మాణానికంటే ముందు అదొక శ్మశానవాటికని.. అందుకే అక్కడ అంత పెద్ద ఎత్తున మానవ ఎముకలు దొరికాయని ఓ అంచనాకు వచ్చారు కొందరు.ఆ ఇంట్లో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని.. ఇదంతా వాటి ఫలితమేనని నమ్మడం మొదలుపెట్టారు మరికొందరు. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఎందరో నిపుణులు, పర్యాటకులు పలు ప్రయోగాలు చేసి.. స్వయంగా బాధితులు అయ్యారు తప్ప.. బలమైన కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. దాంతో నేటికీ ఈ భవనం.. ప్రపంచంలోనే అత్యంత హంటెడ్ నిర్మాణాల్లో ఒక్కటిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ హడలెత్తిస్తున్న అతీంద్రియ శక్తి ఏంటీ? నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? అక్కడ దొరికిన ఎముకలు.. వాటి వెనుకున్న విషాధ గాథలు ఏవీ తేలకపోవడంతో ఈ ఇంటి చరిత్ర మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన
న్యూస్ పాడ్‌కాస్ట్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
హైకోర్టు లాయర్ చైత్రా ఆత్మహత్య
యశవంతపుర: కేఏఎస్ అధికారి భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. సంజయనగర పోలీసుస్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కేఏఎస్ అధికారి శివకుమార్ భార్య చైత్రా హైకోర్టు వకీలు. శుక్రవారం రాత్రి ఇంటిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మృతురాలి సోదరుడు ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా సంజయనగర పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.మృతిపై అనుమానాలుచైత్ర భర్త శివకుమార్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థలో సబ్ డివిజనల్ అధికారిగా ఉన్నారు. చైత్రతో ఆయనకు 2016లో వివాహమైంది, వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి ఆయన డ్యూటీ నుంచి ఇంటికి రాగా, భార్య అచేతనంగా పడి ఉంది. దీంతో వెంటనే స్థానిక సంజయనగర పోలీసులకు కాల్ చేశారు. చైత్ర హైకోర్టు లాయరుగా పనిచేస్తూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఆమె షటిల్ బ్యాడ్మింటన్ వంటి ఆటల్లోనూ ప్రావీణ్యురాలు. ఆమె మృతిని నమ్మలేకపోతున్నట్లు బంధుమిత్రులు తెలిపారు. ఎంతో చలాకీగా ఉండేదని, ఆత్మహత్య చేసుకుందంటే నమ్మశక్యంగా లేదని అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
ఖమ్మం సహకారనగర్: బీటెక్ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ (24) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేయగా అమెజా న్లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు. కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్ క్రీక్ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్‌తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్‌తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
దారుణం : తల్లిపై కాల్పులు, భార్యా పిల్లల హత్య, ఆపై ఆత్మహత్య
ప్రపంచవ్యాప్తంగా మదర్స్ వేడుకలకు సిద్ధమవుతుండగా ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మత్తుమందులు, మద్యానికి అలవాటు పడిన వ్యక్తి మొత్తం కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం లక్నోకు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్‌లోని రాంపూర్ మధురలోని పల్హాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అనురాగ్ సింగ్ (45) మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. మానసికంగా వికలాంగుడిగా మారిపోయాడు. దీంతో అతగాడిని డీ-అడిక్షన్ సెంటర్‌కి పంపాలని కుటుంబం భావించింది. కానీ విషయంలో సభ్యులతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే మరోసారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్మాదిలా మారి పోయాడు. తొలుత 65 ఏళ్ల తల్లి సావిత్రిని కాల్చి చంపాడు, తరువాత భార్య ప్రియాంక (40)ని సుత్తితో కొట్టి హత్య చేశాడు. అంతటితో ఆగలేదు ముగ్గురు పిల్లలను (కుమార్తె అశ్విని (12), చిన్న కుమార్తె అశ్విని (10)లను హత్య చేశాడు.ఆ తర్వాత అనురాగ్ తనను తాను కాల్చుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడని సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారుఈ వార్త దావానలంలా వ్యాపించడంతో సంఘటనా స్థలం వద్ద జనం పెద్ద ఎత్తున గుమి గూడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షించారు.
Swimming Pool: అయ్యో శివశౌర్య
మొయినాబాద్: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని.. ఆటలో మెలకువలు నేర్చుకుందామని వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారాడు. స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ఒకటో తరగతి చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం సుజాత స్కూల్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్‌కు చెందిన గాండ్ల విక్రమ్ చిన్న కుమారుడు గాండ్ల శివశౌర్య (7) నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని సుజాత స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్కూల్లో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు క్రికెట్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, యోగాతో పాటు స్విమ్మింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విక్రమ్ తన కుమారుడు శివశౌర్యను బ్యాడ్మింటన్ నేరి్పంచేందుకు క్యాంపులో చేరి్పంచాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో శివÔౌర్య స్విమ్మింగ్ చేస్తూ నీటిలో మునిగాడు. సిబ్బంది గమనించి విద్యారి్థని బయటకు తీశారు. నీళ్లు మింగి అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. నాలుగు రోజులుగా పిల్లల స్విమ్మింగ్ పూల్ రిపేర్‌లో ఉంది. దీంతో పెద్దల స్విమ్మింగ్ పూల్‌లోనే పిల్లలను స్విమ్మింగ్ చేయిస్తున్నారు. పిల్లలకు సేఫ్టీ బెలూన్స్ లేవని.. అవి తేవాలని కోచర్లు యాజమాన్యానికి సూచించినా వారు పట్టించుకోలేదని తెలిసింది. గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు సమ్మర్ క్యాంపులో భాగంగా బ్యాడ్మింటన్ శిక్షణకు పంపామని.. స్విమ్మింగ్ చేయిస్తున్నట్లు తమకు తెలియదని చిన్నారి తండ్రి విక్రమ్ రోదించారు. తమ కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమని వాపోయారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.