రూ.1.42 కోట్ల వ్యయంతో.. | Sakshi
Sakshi News home page

రూ.1.42 కోట్ల వ్యయంతో..

Published Fri, Mar 10 2023 12:22 AM

-

పెదవాగు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.42 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ప్రధానంగా మూడు గేట్లను మరమ్మతు చేయడం, ప్రధాన స్లూయీజ్‌లకు ఐరన్‌ రెయిలింగ్‌, గేట్లను పైకి, కిందకు దించేందుకు 12.5 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు మెటార్లు, కాపర్‌ కేబుల్‌తోపాటు ఇతర పనులు చేపట్టనున్నారు. ఈ పనులను వర్షాకాలం నాటికి పూర్తి చేస్తారు. దీంతో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో లీకేజీల సమస్య తొలగిపోయి, రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కాగా చాలాకాలం తర్వాత పెదవాగు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేపడుతుండడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. దీనిపై ప్రాజెక్ట్‌ ఏఈఈ కేఎన్‌బీ కృష్ణ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పనులు ప్రారంభించామని, సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే పంటల సీజన్‌కు లీకేజీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

Advertisement
Advertisement