రేపటి నుంచి సదరం క్యాంపులు | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సదరం క్యాంపులు

Published Fri, Jun 2 2023 12:14 AM

-

చుంచుపల్లి: ఈ నెల 3,8,16,23,30 తేదీల్లో జిల్లాలో సదరం క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డీఆర్డీఓ మధుసూధన్‌రాజు గురువారం వివరాలు వెల్ల డించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉదయం 10 గంటల నుంచి కాం్యపులు ప్రారంభిస్తారు. దివ్యాంగులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ చేత ప్రాథమిక పరిశీలన చేసి వికలాంగత్వం గుర్తింపు సర్టిఫికెట్‌తో పాటు ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటో, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలతో మీసేవ కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా నమోదు చేసుకునే వారితో పాటు తాత్కాలిక సదరం సర్టిఫికెట్‌ గడువు ముగిసినవారు మాత్రమే స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. దీని కోసం రూ.35 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం క్యాంపులకు హాజరుకావాల్సిఉంటుంది. కాగా దివ్యాంగులకు మొత్తం 21 విభాగాల్లో ధ్రువప్రతాలు ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం ఆరు, ఏడు విభాగాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. శారీరక, దృష్టిలోపం, చెవిటి, మూగ, బుద్ధి మాంద్యం, మానసిక వైకల్యం, మల్టిబుల్‌ డిజేబుల్‌ అంశాలనే పరిశీలిస్తున్నారు. చెవికి సంబంధించి 51 శాతం వైకల్యం, మిగతా విభాగాలకు 40 శాతం వైకల్య లోపాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. శిబిరాల్లో దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పక్షం రోజులో్‌ల్‌ సదరం గుర్తింపు పత్రాలను జారీ చేస్తారు.

Advertisement
Advertisement