పెద్ద మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటాలి | Sakshi
Sakshi News home page

పెద్ద మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటాలి

Published Wed, Aug 2 2023 12:34 AM

నర్సరీని పరిశీలిస్తున్న మధుసూదన్‌ రాజు   - Sakshi

చుంచుపల్లి : పెద్ద మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్‌లో రోడ్లకు ఇరువైపులా నాటేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జి.మధుసూదన్‌ రాజు సూచించారు. మంగళవారం ఆయన చుంచుపల్లి మండలంలోని వెంకటేశ్వర కాలనీ, బాబుక్యాంప్‌లలో నర్సరీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరితహారంలో ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని, ఆ వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామాల వారీగా హరిత హారం లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు. జామ, మునగ, సీతాఫలం, ఫెల్ట్రో ఫోరం, రైన్‌ ట్రీ మొక్కలను పరిశీలించారు. గ్రామాల్లో ప్రధాన రహదారుల వెంట ఖాళీ స్థలాల్లో ఎత్తుగా ఉన్న మొక్కల మధ్యలో వాటిని నాటాలని సూచించారు. ఆయన వెంట ఏపీఓ రఘుపతి, ఈసీ నాగరాజు ఉన్నారు.

Advertisement
Advertisement