బారికేడ్లు దాటిన ఎంపీ ఎస్కార్ట్‌ వాహనం

10 Nov, 2023 00:32 IST|Sakshi
ఎంపీ వాహనాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య నామినేషన్‌ కార్యక్రమానికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యా రు. ఈ సందర్భంగా వెంకటవీరయ్యతో కలిసి ఎంపీ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోనికి వెళ్లారు. ఈక్రమంలో ఆయన ఎస్కార్ట్‌ వాహనం కార్యాలయం వద్ద వంద మీటర్ల బారికేడ్లను దాటి ముందుకొచ్చింది. పోలీస్‌ వాహనం ఆనుకుని బారికేడ్లు తీశాక వెనుకే ఎంపీ వాహనం వస్తుండడంతో పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 200 మీటర్ల మార్కింగ్‌ వద్దే వాహనాలు నిలిపివేయాల్సి ఉండగా.. 100 మీటర్ల మార్కింగ్‌ బారికేడ్లను సైతం దాటి వాహనాలు రావడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు