భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి | Sakshi
Sakshi News home page

భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి

Published Sat, Nov 11 2023 12:10 AM

మాట్లాడుతున్న డీఈఓ వెంకటేశ్వరాచారి - Sakshi

కొత్తగూడెంఅర్బన్‌: చిన్నతనం నుంచే సైన్స్‌ పట్ల అభిరుచి, అవగాహన, ఆసక్తి ఉంటే భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరచారి తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం సింగరేణి ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ ఎస్‌.చలపతిరాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు పరిశోధనల పట్ల అవగాహన పెంపొందించుకుందేకు బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ఉపయోగపడుతుందన్నారు. జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌.చలపతిరాజు మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలకు మొత్తం 96 ప్రాజెక్టులు వచ్చాయని, వీటిలో నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. గౌతంపూర్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భద్రాచలం సెయింట్‌ పాల్స్‌ , మణుగూరు భాషా హై స్కూల్‌, కొత్తగూడెం త్రివేణి స్కూల్‌ జిల్లాలో ఉత్తమంగా నిలిచి, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఆయా ప్రాజెక్ట్‌ల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సింగరేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శారద, విద్యాశాఖ అధికారులు నాగరాజశేఖర్‌, సతీష్‌, పి.ప్రభాకర్‌రావు, బి.సంపత్‌కుమార్‌, న్యాయ నిర్ణేతలు బి.మాధవి, పావని, వైష్ణవి పాల్గొన్నారు.

హాజరు వివరాలు యాప్‌లో నమోదు చేయాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరు వివరాలను యాప్‌లో నమోదు చేయాలని డీఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. శుక్రవారం ఆయన ఆనందఖని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల ముఖచిత్ర హాజరు నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌లో కూడా హాజరు నమోదు చేయాలని, సోమవారం వరకు ఈ ప్రక్రియ పూర్తికావాలని సూచించారు. హాజరు, అడ్మిషన్‌ రిజిస్టర్లలో విద్యార్థి శాశ్వత విద్యా సంఖ్య నమోదు చేయాలన్నారు.

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో

డీఈఓ వెంకటేశ్వరాచారి

Advertisement
Advertisement