కాంగ్రెస్‌కు జెడ్పీటీసీ గుడ్‌బై | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు జెడ్పీటీసీ గుడ్‌బై

Published Wed, Nov 15 2023 12:24 AM

-

హరీశ్‌రావు సమక్షాన బీఆర్‌ఎస్‌లో చేరిక

కామేపల్లి: ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని కామేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బానోత్‌ వెంకటప్రవీణ్‌కుమార్‌నాయక్‌ కాంగ్రెస్‌ను వీడారు. కాంగ్రెస్‌ నుంచి ఇల్లెందు టికెట్‌ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురుకావడంతో రెబల్‌గా నామినేషన్‌ వేశారు. ఇంతలోనే మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షాన బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయన వెంట పొన్నేకల్‌ ఎంపీటీసీ మాలోత్‌ శంకర్‌నాయక్‌ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.

Advertisement
Advertisement