స్కోడా కారులో గంజాయి రవాణా! | Sakshi
Sakshi News home page

స్కోడా కారులో గంజాయి రవాణా!

Published Wed, Nov 15 2023 12:24 AM

గంజాయి, నిందితులను చూపుతున్న ఎకై ్సజ్‌ అధికారులు - Sakshi

పాల్వంచ: కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఖమ్మం ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలోని రాజస్థాన్‌ దాబాకు చెందిన అహ్మద్‌ రజా, మహారాష్ట్రకు చెందిన నగేశ్‌, రాజస్థాన్‌కు చెందిన రాజు కలిసి స్కోడా కారులో రూ.20 లక్షల విలువైన గంజాయిని ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరిలో కొనుగోలు చేసి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర తరలించేందుకు బయలుదేరారు. పాల్వంచలోని బీసీఎంరోడ్‌లో ఎన్‌ఫోన్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ తిరుపతి, సీఐ సర్వేశ్వరరావు కారును అదుపులోకి తీసుకుని, గంజాయి బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. దాడిలో హెడ్‌ కానిస్టేబుళ్లు కరీంబాబు, కానిస్టేబుల్‌ సుధీర్‌, హరీశ్‌, వెంకట్‌ హనుమంతరావు, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

కోడిపందేల స్థావరంపై దాడి

ములకలపల్లి: కోడిపందేలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు.. రంగాపురం గ్రామ శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో దాడులు నిర్వహించి రూ.7,650 నగదు తోపాటు మూడు కోడి పుంజులు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాఽధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement