విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

Published Sun, Nov 19 2023 12:18 AM

విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తున్న
ఏడీ శ్రీనివాసాచారి - Sakshi

జూలూరుపాడు: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా ఉపాధ్యాయులు పాటుపడాలని రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌(ఏడీ) ఎస్‌.శ్రీనివాసాచారి సూచించారు. జూలూరుపాడు మండలంలోని జూలూరుపాడు, కాకర్ల, గుండెపుడి హైస్కూళ్లతోపాటు జూలూరుపాడు ప్రాథమిక పాఠశాలను భద్రాద్రి డీఈఓ వెంకటేశ్వరచారితో కలిసి ఏడీ శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌, తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాల అమలుపై సమీక్షించిన ఏడీ... విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అలాగే, తల్లిదండ్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన ఏడీ, డీఈఓ మాట్లాడుతూ.. అన్ని సబ్జెక్టులను ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి ప్రత్యేక తరగతులు బోధిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారులు నాగ రాజశేఖర్‌, సతీశ్‌, ఐఈడీ కోఆర్డినేటర్‌ సైదులు, ఎంఈఓ గుగులోత్‌ వెంకట్‌, హెచ్‌ఎంలు లక్ష్మీనర్సయ్య, సంజీవరావు, మంగవేణి, హెచ్‌ఎం గీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌

శ్రీనివాసాచారి

Advertisement

తప్పక చదవండి

Advertisement