పోస్టల్‌ బ్యాలెట్‌లో 268 ఓట్లు | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌లో 268 ఓట్లు

Published Wed, Nov 22 2023 12:26 AM

కొత్తగూడెంలో వృద్ధురాలితో ఓటు వేయిస్తున్న ఎన్నికల సిబ్బంది   - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని ఈ ఏడాది ఎన్నికల సంఘం అమలు చేస్తోంది. జిల్లాలో ఈ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయింది. ఇందుకోసం బీఎల్‌ఓల ద్వారా 484 మంది వృద్ధులు, 241 మంది దివ్యాంగులు, ఎసెన్షియల్‌ ఆల్‌ సర్వీస్‌ ఓటర్లు 41 మంది.. మొత్తం 766 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించగా మొదటి రోజున 209 మంది వృద్ధులు, 59 మంది దివ్యాంగులు.. మొత్తం 268 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పినపాక నియోజకవర్గంలో 54 మంది వృద్ధులు, 54 మంది దివ్యాంగులు ఉండగా, ఇంకా అక్కడ పోలింగ్‌ ప్రారంభం కాలేదు. ఇల్లెందు నియోజకవర్గంలో 108 మంది వృద్ధులు, 35 మంది దివ్యాంగులు ఉండగా.. మొదటి రోజు 44 మంది వృద్ధులు, 9 మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అశ్వారావుపేటలో 126 మంది వృద్ధులు, 48 మంది దివ్యాంగులకు గాను 82 మంది వృద్ధులు, 28 మంది దివ్యాంగులు ఓటు వేశారు. భద్రాచలంలో 86 మంది వృద్ధులు, 52 మంది దివ్యాంగులు, 41 మంది సర్వీస్‌ ఓటర్లు ఉండగా 59 మంది వృద్ధులు, 43 మంది దివ్యాంగులు, 16 మంది సర్వీస్‌ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెంలో 110 మంది వృద్ధులు, 52 మంది దివ్యాంగులకు 40 మంది వృద్ధులు, ఆరుగురు మంది దివ్యాంగులు ఓటు వేశారు.

తొలిరోజు ఓటేసిన 209 మంది

వృద్ధులు.. 59 మంది దివ్యాంగులు

Advertisement
Advertisement