-

కూనంనేనికే ఫార్వర్డ్‌ బ్లాక్‌ మద్దతు.. : సీపీఐ సభ్యుడు రామరాజు

28 Nov, 2023 13:33 IST|Sakshi
సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు

ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామరాజు

సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: కొత్తగూడెంలో మిత్రపక్షాలు బలపరుస్తున్న సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకే ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామరాజు తెలిపారు. సోమవారం శేషగిరిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఫార్వర్డ్‌ బ్లాక్‌ వామపక్ష పార్టీలు పోటీ చేసే చోట పోటీ చేయకూడదని నిర్ణయించిందని, ఇందుకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించారని, పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు బీఫాం ఎలా కేటాయించారని ప్రశ్నించారు. నేతాజీ ఆశయాలతో పనిచేస్తున్న ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ బీ ఫామ్‌ వామపక్ష వ్యతిరేకికి ఇవ్వడం సరికాదన్నారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ కార్యకర్తలు కూనంనేని విజయానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: పొత్తులో కత్తులు! బీజేపీ, జనసేనల మధ్య వాగ్వాదం..

మరిన్ని వార్తలు