Amazon Will Face Black Friday Strikes and Protests in 20 Countries - Sakshi
Sakshi News home page

జెఫ్‌ బెజోస్‌కు ఇ‍క చుక్కలే..20కి పైగా దేశాల్లో అమెజాన్‌ ఉద్యోగుల స్ట్రైక్‌..!

Published Sun, Nov 21 2021 8:26 AM

20 countries amazon employees strike on black Friday November 26 - Sakshi

Amazon Workers Strike on Black Friday: అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌కు ఆ సంస్థ ఉద్యోగులు షాక్‌ ఇవ్వనున్నారు. 20దేశాలకు చెందిన అమెజాన్‌ ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్నా చేయనున్నారు. కరోనా మహమ్మారిలోనూ రేయింబవళ్లు సంస్థకోసం పనిచేశామని, అందువల్లే జెఫ్‌బెజోస్‌ 200 బిలియన్ల డాలర్లతో ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారని గుర్తు చేస్తున్నారు. తాము పనికి తగ్గట్లు వేతనాన్ని ఆశిస్తున్నామని ఇప్పటికే స్ట్రైక్‌లో పాల్గొన్న ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   

నవంబర్‌ 26న 
నవంబర్‌ 26న అమెజాన్‌లో పనిగంటలు, కింది స్థాయి ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారులు అకౌంటబులిటీ (జవాబు దారీతానాన్ని)తో పాటు మొత్తం 25రకాల డిమాండ్లను నెరవేర్చాలని బ్లాక్ ఫ్రైడే రోజు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ సమ్మెలో 20 లేదా అంతకాన్నా ఎక్కువ దేశాలకు చెందిన అమెజాన్‌ ఉద్యోగులు,యూనియన్‌ సంఘాలు, గ్రీన్‌పీస్, ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు స్ట్రైక్‌కు మద్దతు పలకనున్నారు.  

ఎక్కువ తీసుకుంటుంది.. తక్కువ ఇస్తుంది
అమెజాన్‌లో పనిగంటలు ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనిగంటలు ఎక్కువగా ఉన్న అందుకు తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని, కానీ అలా జరగడం లేదన్నారు. ఉద్యోగులతో పని ఎక్కువ పనిచేయించుకుంటుంది. తక్కువ జీతాల్ని చెల్లిస్తుంది' అంటూ ఉద్యోగులు చేస్తున్న స్ట్రైక్‌ ప్రపంచానికి తెలిపేందుకు మేక్‌ అమెజాన్‌పే.కామ్‌ పేరుతో వెబ్‌సైట్‌ ను లాంఛ్‌ చేశారు. ఆ వెబ్‌ సైట్‌లో ఉద్యోగులు పేర్కొన్నారు.  

జెఫ్‌ జెజోస్‌పై ఆగ్రహం 
ఉద్యోగులు చేస్తున్న స్ట్రైక్‌కు మద్దతుగా పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెజాన్ పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటుందంటూ 'ప్రోపబ్లికా' నివేదిక వెలుగులోకి వచ్చింది. నివేదిక ప్రకారం జెఫ్‌బెజోస్‌ 2006 నుంచి 2018 మధ్య ఎలాంటి పన్నులు చెల్లించలేదని నివేదికలో పేర్కొంది. అయితే ఈ పరిణామల నేపథ్యంలో అమెజాన్‌ ఉద్యోగులు చేస్తున్న ధర్నా జెఫ్‌బెజోస్‌కు పెద్దదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం..దిగ్భ్రాంతిలో ఆనంద్‌ మహీంద్రా

Advertisement
Advertisement