యువ సీఈవో దారుణ హత్య .. ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చోటు కూడా..

27 Sep, 2023 11:01 IST|Sakshi

ఫోర్బ్స్‌ అండర్‌ - 30 జాబితాలో స్థానం సంపాదించుకున్న టెక్‌ కంపెనీ సీఈవో, 26 ఏళ్ల పావ లాపెరే దారుణ హత్యకు గురయ్యారు. ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించినట్లు  పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

డేటా-క్యూరేటింగ్ కంపెనీ ఎకోమ్యాప్ టెక్నాలజీస్‌ కో-ఫౌండర్‌ లాపెరే అమెరికాలోని బాల్టిమోర్ సిటీ కౌంటీలోని ప్రముఖ అపార్ట్‌మెంట్‌ మౌంట్‌ వెర్నాన్‌లో నివసిస్తున్నారు. అయితే ఆ అపార్ట్‌మెంట్ సర్వీస్‌ విభాగం నుంచి సమాచారం అందుకున్న బాల్టిమోర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (BPD)అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలమీద తీవ్ర గాయమై మరణించిన పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు.  

పోలీసుల అదుపులో జాసన్‌ డీన్‌
సీఈవో హత్యలో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న జాసన్ డీన్ బిల్లింగ్స్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారుల ప్రకారం, జాసన్ డీన్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. హత్య చేస్తాడు. అఘాయిత్యాలకు పాల్పడతాడు. ఇతరులకు హాని కలిగించేలా అతను చేయాల్సినందతా చేస్తాడని’ తాత్కాలిక పోలీసు కమిషనర్ రిచర్డ్ వర్లీ తెలిపారు. 

ఇది ఊహించ లేని విషాదం
లాపెరే మరణంపై ఈ-కోమ్యాప్‌ టెక్నాలజీ సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు.ఊహించలేని విషాదం. ఆమె మరణానికి కారణమైన పరిస్థితులు తీవ్ర బాధని కలిగిస్తున్నాయని ట్వీట్‌ చేసింది. ఈకోమ్యాప్‌ వృద్దిలో లాపెరే దూరదృష్టి, అంకిత భావం కలిగిన గొప్ప లీడర్‌’ అంటూ కొనియాడింది.  

వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. లాపెరే స్టార్టప్ కంపెనీ ఈకోమ్యాప్‌ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వహించే వారు. ఫోర్బ్స్ అండర్ 30 ధనవంతుల జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో, ఈకోమ్యాప్‌ విలువ 8 మిలియన్లకు చేరుకుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు