360 వన్‌కు ముంబై ఏంజెల్స్‌లో నియంత్రణ వాటా

19 Jan, 2023 01:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆరంభ స్థాయి కంపెనీల్లో వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు పెట్టే ‘ముంబై ఏంజెల్స్‌’లో నియంత్రిత వాటాను సొంతం చేసుకున్నట్టు 360 వన్‌ (గతంలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌) ప్రకటించింది. ఆరంభ స్థాయి పెట్టుబడుల విభాగంలో ముంబై ఏంజెల్స్‌ ప్రముఖ సంస్థగా ఉందని, ఈ కొనుగోలుతో స్టార్టప్‌లలో పెట్టుబడులను మరింత విస్తతం చేయనున్నట్టు తెలిపింది. తమ ఇన్వెస్టర్లకు మరింత విస్తృత శ్రేణి డీల్స్‌ను ఆఫర్‌ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొంది.

ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మద్దతుగా నిలవడం ద్వారా, తమ ఇన్వెస్టర్ల సంపద వృద్ధికి సాయపడనున్నట్టు వివరించింది. మరోవైపు ముంబై ఏంజెల్స్‌ రెండు నూతన వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ను ఈ సందర్భంగా ప్రకటించింది. ఆరంభ దశలోని కంపెనీల్లో ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాలను వీటి ద్వారా తమ క్లయింట్లకు అందించొచ్చని 360వన్‌ ఎండీ, సీఈవో కరణ్‌ భగత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు