రిలయన్స్‌ ఏజీఎం: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నీతా అంబానీ కొత్త ప్లాన్స్‌ | 46th Reliance AGM 2023: Nita Ambani Announces Collobaration With Bill Gates Foundation, Video Viral - Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ ఏజీఎం: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నీతా అంబానీ కొత్త ప్లాన్స్‌

Published Mon, Aug 28 2023 4:05 PM

46th Reliance AGM 2023: Nita AmbaniCollobaration With Bill Gates Foundation - Sakshi

Reliance AGM Nita Amban NMACC 46వ రిలయన్స్‌ వాటాదారుల వార్షిక సమావేశంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు నీతా అంబానీ రిలయన్స్‌ ఫౌండేషన్‌ సాధించిన విజయాలను, భవిష్యత్‌ ప్రణాళికలను వివరించారు. దేశ సంసృతినుంచి క్రీడల దాకా  తమ ఫౌండేషన్‌ కృషిని వివరించారు. ముఖ్యంగా నీతా ముఖేష్‌ అంబానీ  కల్చరల్‌ సొసైటీ గురించి ప్రకటించారు. భారతీయ సంస్కృతి,కళ పట్ల తమ నిబద్ధతకు  తాము  లాంచ్‌ చేసిన ఎన్‌ఎంఏసీసీ అని తెలిపారు.  

రానున్న పదేళ్లలో 50వేల మంది విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం పనిచేయనున్నాం.బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిపి మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. 10 లక్షల మహిళల సాధికారత కోసం తాము బాగా కృషి చేయనున్నట్టు నీతా అంబానీ వెల్లడించారు. విద్య, క్రీడలు ఇప్పటివరకు 22 మిలియన్ల మంది యువకులకు  చేరువయ్యాయని నీతా అంబానీ చెప్పారు ఈ సందర్భంగా బిల్‌ గేట్స్‌  దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించారు.

రానున్న పదేళ్లలో 50వేలమంది విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం పనిచేయనున్నాం. ఈ సెంటర్‌ను లాంచ్‌ చేసినప్పటినుంచి 20లక్షలమంది ఈ సెంటర్‌ను సందర్శించి నట్టు తెలిపారు. అలాగే ఐపీఎల్‌ టీం గురించి మాట్లాడారు.హార్ధిక ప్యాండ్యా, బుమ్రా,తిలక​ వర్మ  గురించి  చెప్పారు. విదేశాల్లో ముఖ్యంగా విమెన్‌ ఐపీఎల్‌ టీం ప్రారంభించినట్టు తెలిపారు. అంతర్జాతీయ ఒలంపిక్‌ మెంబర్‌గా ఇండియాకు ఎలంపిక్‌ తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

రిలయన్స్ ఫౌండేషన్‌తో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై మైక్రోసాఫ్ట్‌ కో-ఫౌండర్‌ బిల్ గేట్స్ 

సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం  ఆవిష్కరణలు ఆకర్షణీయంగా ఉన్నాయి.  అలాగే ఆ ఆవిష్కరణలను అత్యంత అవసరమైన వారికి అందించడంపై దృష్టి పెట్టడం కూడా బావుంది: బిల్ గేట్స్ అధిక-నాణ్యత, సరసమైన మందులు, వ్యాక్సిన్‌లను తయారు చేయడంలో భారతదేశం   బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. రిలయన్స్‌తో ఫౌండేషన్ సహకారంతో మాదక ద్రవ్యాలు , పాయింట్-ఆఫ్-కేర్ డయాగ్నస్టిక్‌లను అభివృద్ధికి, కొత్త ఆవిష్కరణలు  అమలుకు మద్దతు ఇవ్వాలని  లక్ష్యంగా పెట్టుకున్నామనీ చెప్పారు. అంటు వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా తాము సంఘాలతో కలిసి పని చేయడం కూడా కొనసాగిస్తామని బిల్ గేట్స్ ప్రకటించారు.<

Advertisement
Advertisement